Sharwanand : డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌తో రానున్న శర్వానంద్ ఒకేఒక జీవితం మూవీ….

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Jul 28, 2021 | 11:53 AM

యంగ్ హీరో శర్వానంద్ త్వరలో మహాసముద్రం సినిమాతో ప్రేక్ష్కువుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

Sharwanand : డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌తో రానున్న శర్వానంద్ ఒకేఒక జీవితం మూవీ....
Sharwanand

Sharwanand : యంగ్ హీరో శర్వానంద్ త్వరలో మహాసముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆర్ఎక్స్ 100సినిమాతో సంచలన విజయం సాధించిన అజయ్ భూపతి ఈ సిమిమాకు దర్శకత్వం వహిస్తోన్నాడు. ఈ సినిమాలో బొమ్మ‌రిల్లు హీరో సిద్ధార్థ్ కూడా నటిస్తోన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ‘ఒకేఒక జీవితం’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’  అనే సినిమాలు కూడా చేస్తున్నాడు శర్వా. ఇలా బ్యాక్ టూ బ్యాక్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు ఈ యంగ్ హీరో. అయితే ‘ఒకేఒక జీవితం’ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ టాపిక్ ఫిలిం సర్కిల్స్‌‌‌‌‌లో చక్కర్లు కొడుతోంది. శర్వా కెరీర్‌‌‌లో రూపొందుతోన్న 30వ చిత్రం ఇది. ఈ సినిమా ద్వారా శ్రీ కార్తిక్ దర్శకుడిగా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్‌‌‌ఆర్ ప్రకాశ్ బాబు – ఎస్‌‌‌ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌‌‌లుక్ పోస్టర్‌‌‌కు మంచిరెస్పాన్స్ వచ్చింది.

ఇక ఒకేఒక జీవితం సినిమా ఒక టైమ్ ట్రావెల్ కథ అని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ప్రభాస్ నాగ్‌‌‌అశ్విన్ సినిమా కూడా టైమ్ ట్రావెల్ కథే అని తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు వచ్చిన టైమ్ ట్రావెల్ సినిమాలతో పోల్చితే ఈ సినిమా విభిన్నంగా ఉంటుందని ఫిలిం నగర్‌‌‌‌లో టాక్ వినిపిస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కే ఈ సినిమా ఖచ్చితంగా తనకు సాలిడ్ హిట్ అందిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు శర్వా. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Krithi Shetty: ఉప్పెన భామ జోరు మాములుగా లేదుగా.. బుల్లి తెర ప్రకటన కోసం భారీ రెమ్యునరేషన్‌ తీసుకున్న కృతి.

Shaakuntalam : అంచనాలను ఆకాశానికి చేర్చిన గుణశేఖర్.. శాకుంతలం వాటిని అందుకునేనా..

Samantha: రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో అక్కినేని సమంత.. అభిమానులకు పండగే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu