Manamey: పిఠాపురంలో శర్వానంద్ ‘మనమే’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా ఆ మెగా హీరో!
పిఠాపురం.. గత రెండు నెలలుగా ఈ ఊరి పేరు తెగ మార్మోగిపోతోంది. జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచే ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగడమే ఇందుకు కారణం. ఇక మంగళ వారం (జూన్ 4)న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో అందరి దృష్టి పిఠాపురంపైనే ఉందని చెప్పడంలో అతి శయోక్తి లేదు

పిఠాపురం.. గత రెండు నెలలుగా ఈ ఊరి పేరు తెగ మార్మోగిపోతోంది. జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచే ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగడమే ఇందుకు కారణం. ఇక మంగళ వారం (జూన్ 4)న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో అందరి దృష్టి పిఠాపురంపైనే ఉందని చెప్పడంలో అతి శయోక్తి లేదు. ఇలా పవన్ కల్యాణ్ పోటీతో అందరి నోళ్లలో నానిని పిఠాపురంలో ఇప్పుడు ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమానికి మెగా హీరో చీఫ్ గెస్ట్ గా రానుండడం విశేషం. శర్వానంద్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘మనమే’. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి ఇందులో కథానాయిక. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న మనమే సినిమా జూన్ 7న గ్రాండ్ గా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్లలో భాగంగా జూన్ 5న అంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రోజే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే మూవీ ఈవెంట్ కు అనుమతులు కూడా రావాల్సి ఉంది.
ఇక మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు ప్రచారం జరుగుతోంది. శర్వానంద్, రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఈ అనుబంధం కారణంగానే శర్వా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రామ్ చరణ్ రానున్నాడని తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో ఏకంగా 16 పాటలు ఉన్నాయని తెలుస్తోంది. ఇదే నిజమైతే తెలుగులో అత్యధిక పాటలు ఉన్న మూవీగా మనమే రికార్డుల కెక్కనుంది. ఈ సినిమాకు ఖుషి ఫేమ్ హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందించాడు.
Painting the world with love, fun, and entertainment! 🎨🤩
Biggest Entertainer of the Season ~ #ManameyTrailer is out now ▶️ https://t.co/s5TqgbepIX
Experience the magic and excitement at theatres near you on JUNE 7th! 🥳#Manamey @ImSharwanand @IamKrithiShetty @SriramAdittya… pic.twitter.com/yv8U7yESpn
— People Media Factory (@peoplemediafcy) June 1, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




