Aadavallu Meeku Joharlu: ఆడవాళ్లు మీకు జోహార్లు టీజర్ వచ్చేది అప్పుడే.. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో హిట్ కొడతానంటున్న యంగ్ హీరో..
యంగ్ హీరో శర్వానంద్ సరైన హిట్ అందుకొని చాలా కాలమే అయ్యింది. ఈ మధ్య శర్వా నటించిన సినిమాలన్నీ అభిమానులను నిరాశపరుస్తున్నాయి.
Aadavallu Meeku Joharlu: యంగ్ హీరో శర్వానంద్ సరైన హిట్ అందుకొని చాలా కాలమే అయ్యింది. ఈ మధ్య శర్వా నటించిన సినిమాలన్నీ అభిమానులను నిరాశపరుస్తున్నాయి. చివరిగా వచ్చిన మహాసముద్రం సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేక పోతున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు ఎలాగైనా మంచి హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు శర్వా. ఇక శర్వానంద్ (Sharwanand) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavallu Meeku Joharlu). ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శర్వానంద్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. దాంతో ఈ సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. ఈ క్రమంలో సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కూడా వదిలారు. ఈ సినిమాతో శర్వానంద్ హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు ఆయన అభిమానులు. ఖుష్బు – రాధిక శరత్ కుమార్ – ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెన్నెల కిషోర్ – రవిశంకర్ – సత్య – ప్రదీప్ రావత్ – గోపా రాజు – బెనార్జీ – కళ్యాణి నటరాజన్ – రాజశ్రీ నాయర్ – ఝాన్సీ – రజిత – సత్య కృష్ణ – ఆర్సిఎం రాజు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.