Sehari: బాల‌య్య‌బాబు గారి వ‌ల్లే మా సినిమా స్థాయి పెరిగింది.. యంగ్ హీరో ఎమోషనల్ కామెంట్స్

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో రూపొందిన‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘సెహరి’.

Sehari: బాల‌య్య‌బాబు గారి వ‌ల్లే మా సినిమా స్థాయి పెరిగింది.. యంగ్ హీరో ఎమోషనల్ కామెంట్స్
Sehari
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 08, 2022 | 8:44 PM

Sehari: హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో రూపొందిన‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘సెహరి’. వర్గో పిక్చర్స్ ప‌తాకంపై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన‌ ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 11న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ప్రీరిలీజ్ వేడుక హైద‌రాబాద్‌లోని పార్క్ హ‌య‌త్‌లో సోమ‌వారం రాత్రి ఘ‌నంగా జ‌రిగింది. ఈ సంద‌ర‌భంగా హీరో హ‌ర్ష్ కనుమిల్లి మాట్లాడుతూ.. మా సినిమాకు అంద‌రూ బాగా స‌పోర్ట్ చేశారు. సోష‌ల్ మీడియాలో మీమ్స్‌ ద్వారా మంచి మైలేజ్ వ‌చ్చింది అన్నారు. నేను స్కూల్ డేస్‌లో వ‌ర‌స్ట్ స్టూండెట్‌ను. చాలా సార్లు ఫెయిల్ అయ్యాను అని అన్నారు. నేను కొన్ని షాట్ ఫిలింస్ చేశాను. కొన్ని సినిమాల‌కు ఆడిష‌న్ వెళ్ళాను. కానీ ఎక్క‌డా సెల‌క్ట్ కాలేదు. అప్పుడు నా స్నేహితులు నీకు నువ్వే ప్రూవ్ చేసుకోవాల‌న్నారు. దాంతో క‌సి పెరిగింది. అలా హీరోగా సెహ‌రి చేశాను అని తెలిపారు. మా సినిమా లాక్‌డౌన్ టైంలో బాల‌య్య‌బాబుగారి పోస్ట‌ర్ లాంచ్ చేశారు. దాంతో సెహ‌రి స్థాయి పెరిగింది. మ‌రోసారి ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను అన్నారు.

అలాగే ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాట‌లు విడుద‌లై మంచి ఆద‌ర‌ణ పొందాయి. య‌శ్ మాస్ట‌ర్ బాగా కంపోజ్ చేశారు. కెమెరామెన్ భ‌విష్య‌త్‌లో మంచి స్థాయికి ఎదుగుతాడు. మంచి క‌ల‌ర్స్ ఇందులోవాడాడు. అనీషా పెట్ ల‌వ‌ర్‌గా న‌టించింది. చాలామందికి క‌నెక్ట్ అవుతుంది. అక్షిత పాత్ర స‌స్పెన్స్‌తో వుంటూ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. సంగీత ద‌ర్శ‌కుడు కోటిగారు మా చిత్రానికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమా. మ‌ళ్లీ మ‌ళ్ళీ చూసేట్లుగా సెహ‌రి వుంటుంద‌ని గ‌ట్టిగా చెప్ప‌గ‌ల‌ను అని తెలిపారు.  సంగీత ద‌ర్శ‌కుడు కోటిగారు మాట్లాడుతూ, ఇందులో న‌న్ను న‌టుడిగా చూపించారు. కొత్త త‌ర‌హాలో క‌నిపిస్తాను. ప్ర‌శాంత్ సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. నేను సంగీతం చేసే తొలి రోజుల్లో అన్ని పాట‌లు హిట్ అవ్వాల‌నే క‌సితో చేసేవాడిని. అది ప్ర‌శాంత్‌లో చూశాను. ఇందులో 9పాట‌లున్నాయి. అన్నీ కేచీగా వున్నాయి. ఆయ‌నకు స‌రిప‌డా టీమ్‌కూడా దొరికింది. ఓసారి చిరంజీవిగారు నాతో ఇలా అన్నారు. ఇన్నాళ్ళు సంగీతం చేశావ్‌. ఎంతో ఎంజాయ్ చేశావ్‌. న‌టుడిగా చేస్తే బాగా ఎంజాయ్ చేస్తావ్ అని అన్నారు. అలాగే ఈ సినిమాలో న‌టించాను. ముందు ముందు మంచి పాత్ర‌లు వ‌స్తే త‌ప్ప‌కుండా న‌టిస్తాన‌ని అన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shah Rukh Khan: షారుక్ ఖాన్ నిజంగా ఆపని చేశాడా..? ఆగ్రహం వ్యక్తం చేసిన నటి ఊర్మిళ

Rajinikanth: సూపర్ స్టార్ 170 కోసం పోటీ పడుతున్న ఆ ఇద్దరు స్టార్ దర్శకులు..

Ghani Song Launch : వరుణ్ తేజ్ గని సినిమా నుంచి అందమైన మెలోడీ.. ఘనంగా సాంగ్ లాంచ్ ఈవెంట్

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!