Meenakshi Chaudhary : తెలుగు డైలాగ్‌లు చెప్ప‌డం నాకు బిగ్ టాస్క్‌.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రవితేజ హీరోయిన్

మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న ఖిలాడీ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మించారు.

Meenakshi Chaudhary : తెలుగు డైలాగ్‌లు చెప్ప‌డం నాకు బిగ్ టాస్క్‌.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రవితేజ హీరోయిన్
Meenakshi Chaudhary
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 08, 2022 | 8:32 PM

Meenakshi Chaudhary : మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న సినిమా ఖిలాడీ. ఈ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మించారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రవితేజ భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన నాలుగు పాటలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఇందులో మూడు పాట‌ల‌ను డింపుల్ హ‌యాతి పై చిత్రించ‌గా, టైటిల్ సాంగ్‌లో మీనాక్షి క‌న్పించ‌నుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రం త‌ర్వాత మీనాక్షి చేస్తున్న సినిమా ఇది. ఈ సంద‌ర్భంగా మీనాక్షి చౌద‌రి మీడియా స‌మావేశంలో ప‌లు విష‌యాలు ఇలా తెలియ‌జేశారు.

మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. తెలుగు డైలాగ్‌లు చెప్ప‌డం నాకు బిగ్ టాస్క్‌ అని తెలిపింది. ర‌వితేజ సినిమాగానే మ‌రో పాట మాట్టాడ‌కుండా అంగీక‌రించాను. ఆయ‌న కామెడీ టైమింగ్ ఫ‌ర్‌ఫెక్ట్‌గా వుంటుంది. అందుకోసం హోం వ‌ర్క్ చేశాను. కొన్ని సీన్స్ చేసేట‌ప్పుడు నేను బెరుకుగా వుంటే కంఫ‌ర్ట్ అయ్యేవ‌ర‌కు టైం తీసుకోమ‌ని సూచించారు. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాను. ఏ సినిమా అయినా పాత్ర నిడివి ఎంత అనేది చూడ‌ను. క‌థ‌లో భాగంగా కేరెక్ట‌ర్ ప్రాధాన్య‌త చూస్తాను. నా రెండో సినిమాకు ఇలాంటి సినిమా రావ‌డం గ్రేట్‌ అని తెలిపింది.  ర‌వితేజ సినిమాల్లో క‌థ‌కు రిలేటెడ్‌గా నాయిక పాత్ర‌లుంటాయి. న‌టిగా నేను యాక్టింగ్ స్కూల్‌లో నేర్చుకున్న‌ది కూడా ఇదే. కేరెక్ట‌ర్‌ను వెంట‌నే జ‌డ్జ్ చేయ‌లేం. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో అన్ని ఎమోష‌న్స్ వుంటాయి. అవి హ్యూమ‌న్ ఎమోష‌న్సే. అంత‌కుమించి లైన్ క్రాస్ చేయం. ఇది కూడా న‌ట‌న‌లో ఓ భాగ‌మే. అలాగే  హిట్ 2 చేశాను. త‌మిళంలో విజ‌య్ ఆంథోని న‌టించిన `కొలై`లో న‌టించాను. అది త్వ‌ర‌లో విడుద‌ల‌కాబోతుంది. మ‌రో రెండు సినిమాలు లైన్‌లో వున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :