Sonal Chauhan: నాగార్జునకు జోడిగా బాలకృష్ణ హీరోయిన్.. ది ఘోస్ట్‌లో లెజెండ్ బ్యూటీ..

కింగ్ నాగార్జున రీసెంట్ గా బంగార్రాజు సినిమాతో మంచి హిట్ అందుకొని ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Sonal Chauhan: నాగార్జునకు జోడిగా బాలకృష్ణ హీరోయిన్.. ది ఘోస్ట్‌లో లెజెండ్ బ్యూటీ..
Sonal Chauhan
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 09, 2022 | 8:20 AM

కింగ్ నాగార్జున రీసెంట్ గా బంగార్రాజు సినిమాతో మంచి హిట్ అందుకొని ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం నాగార్జున (Nagarjuna) యంగ్ హీరోస్‏కు గట్టి పోటీనిస్తున్నారు. వరుస చిత్రాలను లైన్లో పెట్టి దూసుకుపోతున్నారు. గరుడవేగ ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ది ఘోస్ట్ (The Ghost) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫుల్ యాక్షన్ ఎంటర్‏టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ మూవీలో నాగ్.. రిటైర్డ్ రా ఏజెంట్ పాత్రలో కనిపించన్నారు. ఇందులో నాగార్జున పూర్తిగా విభిన్న లుక్‏లో కనిపించనున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభమయిన.. అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను అనుకున్నారు. కానీ ఆమె వ్యక్తిగత కారణాల వలన సినిమా నుంచి తప్పుకున్నారు.

ఆతర్వాత అమల పాల్ ను హీరోయిన్ గా తీసుకోవాలని చూశారు. అయితే అమలాపాల్ భారీగా రెమ్యునరేష్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు వెనక్కి తగ్గారని టాక్ వినిపిస్తుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకోసం బాలయ్య హీరోయిన్ ను ఎంపిక చేశారని తెలుస్తుంది. సోనాల్ చౌహన్ చేసిన సినిమాలు చాలా తక్కువనే. తెలుగులో ఆమె బాలకృష్ణ సరసన అలరించింది. ‘లెజెండ్’ .. ‘డిక్టేటర్’ .. ‘రూలర్’ వంటి సినిమాల్లో ఆమె ఆకట్టుకుంది. ఇప్పుడు ఎఫ్3 సినిమాలోనూ నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. తాజాగా ఈ అమ్మడిని ది ఘోస్ట్ లో హీరోయిన్ గా ఎంపిక చేశారని తెలుస్తుంది. సోనాల్   సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫొటోలను పోస్టు చేస్తూ, యూత్ కి ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది ఈ బ్యూటీ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rashmi Gautam: పాల బుగ్గలు చిన్నది.. పరువాలు వంపుతూ ఫోజులిచ్చిందిగా…

Nandita Swetha: ఇలాంటి మనుషులు ఎలా ఉంటారు.. నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

Sehari: బాల‌య్య‌బాబు గారి వ‌ల్లే మా సినిమా స్థాయి పెరిగింది.. యంగ్ హీరో ఎమోషనల్ కామెంట్స్