Pawan Kalyan : మరోసారి పవన్ కళ్యాణ్ సినిమా బాధ్యతలు తీసుకోనున్న మాటల మాంత్రికుడు..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భీమ్లానాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి హీరో రానా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

Pawan Kalyan : మరోసారి పవన్ కళ్యాణ్ సినిమా బాధ్యతలు తీసుకోనున్న మాటల మాంత్రికుడు..
Pawan Kalyan Trivikram
Follow us

|

Updated on: Feb 09, 2022 | 7:51 AM

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం భీమ్లానాయక్(Bheemla Nayak) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి హీరో రానా కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ అందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిత్యామీనన్, రానా సరసన సంయుక్తమీనన్ నటిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.  ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు పవన్. హరిహర వీరమల్లు అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారు. ప్రియాడికల్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు క్రిష్. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారని తెలుస్తుంది.

ఈ సినిమాలో పవన్ కు జోడీగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తుంది. ‘హరి హర వీరమల్లు’ సినిమా ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను జరుపుకుంది. ‘భీమ్లా నాయక్’ షూటింగు పూర్తయిన తరువాత ఈ సినిమా కంప్లీట్ చేయాలని చూస్తున్నారు పవన్. ఇదిలా ఉంటే పవన్ ఇప్పుడు తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘వినోదయ సీతమ్’ అనే తమిళ రీమేక్ లో వీరిద్దరూ నటించనున్నారని తెలుస్తోంది. సముద్రఖని తెరకెక్కించిన ఈ మూవీ ఇటీవల నేరుగా ఓటీటీలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ఇప్పుడు తెలుగు రీమేక్ లో పవన్ – సాయి తేజ్ నటిస్తున్నారని టాక్ నడుస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భాగస్వామ్యంతో పవన్ కళ్యాణ్ తన సొంత బ్యానర్ పీకే క్రియేటివ్ వర్క్స్ మీద ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తోంది. అయితే ‘వినోదయ సీత’ రీమేక్ ను తెలుగు నేటివిటీకి.. పవన్ కల్యాణ్ ఇమేజ్ కు తగ్గట్టు మార్పులు చేర్పులు చేసే బాధ్యతను కూడా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తీసుకున్నారని అంటున్నారు. ఇప్పటికే బీమ్లానాయక్ సినిమాకోసం పని చేస్తున్న త్రివిక్రమ్ త్వరలోనే ఈ రీమేక్ బాధ్యతలను కూడా తీసుకోనున్నారని అంటున్నారు. ఇక మహేష్ బాబుతో ఇటీవలే సినిమాని ప్రారంభించారు త్రివిక్రమ్. ఏప్రిల్ నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rashmi Gautam: పాల బుగ్గలు చిన్నది.. పరువాలు వంపుతూ ఫోజులిచ్చిందిగా…

Nandita Swetha: ఇలాంటి మనుషులు ఎలా ఉంటారు.. నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్

Sehari: బాల‌య్య‌బాబు గారి వ‌ల్లే మా సినిమా స్థాయి పెరిగింది.. యంగ్ హీరో ఎమోషనల్ కామెంట్స్