Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shanmukha Movie Review: షణ్ముఖ రివ్యూ.. డివోషనల్ థ్రిల్లర్‌తో ఆది సాయికుమార్‌ హిట్ కొట్టాడా?

ఆది సాయికుమార్ హీరోగా షణ్ముగం సాప్పని తెరకెక్కించిన డివోషనల్ ధ్రిల్లర్ 'షణ్ముఖ' ఈ వారమే విడుదలైంది. క్షుద్ర శక్తులు, దేవుడికి మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా కథ. చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ ఇందులో హీరోయిన్‌గా నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది..? ఆది కోరుకున్న విజయాన్ని అందించిందా లేదా చూద్దాం..

Shanmukha Movie Review: షణ్ముఖ రివ్యూ.. డివోషనల్ థ్రిల్లర్‌తో ఆది సాయికుమార్‌ హిట్ కొట్టాడా?
Shanmukha Movie Review
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Basha Shek

Updated on: Mar 21, 2025 | 7:41 PM

మూవీ రివ్యూ: షణ్ముఖ

నటీనటులు: ఆది సాయికుమార్, అవికా గోర్, ఆదిత్య ఓం, చిరాగ్ జానీ, కృష్ణుడు, అరియనా, చిత్రం శీను తదితరులు

సినిమాటోగ్రఫీ: ఆర్.ఆర్. విష్ణు

ఎడిటర్: ఎంఏ మాలిక్

సంగీతం: రవి బస్రూర్

దర్శకుడు: షణ్ముగం సప్పని

కథ:

చుట్టూ అడువులే ఉన్న ఓ కుగ్రామంలో విగాండ (చిరాగ్ జానీ) దంపతులకు షణ్ముఖంతో అంటే.. ఆరు ముఖాలతో చూడ్డానికే భయంకరంగా ఉండే కుమారుడు జన్మిస్తాడు. చిన్నప్పటి నుంచి అతడిని చూసి అంతా భయపడుతుంటారు. తన కుమారుడిని ఎలాగైనా మామూలు మనిషిని చేయాలని.. ఆరు ముఖాల నుంచి ఏక ముఖుడిగా మార్చాలని కాశీ సహా చాలా ప్రదేశాలు తిరిగి.. యోగులు, తాంత్రికుల దగ్గరికి వెళ్లి ఓ పరిష్కారం కనుక్కుంటాడు విగాండ. తన బామ్మర్ది సాయంతో తాంత్రిక పూజలు ప్రారంభిస్తాడు.. అందులో ఆరితేరిపోతాడు. మ‌రోవైపు కార్తీ (ఆది సాయికుమార్) హైదరాబాద్‌లోని ఓ స్టేషన్‌లో పోలీస్ ఆఫీసర్. డ్రగ్ మాఫియాను పట్టుకొనేందుకు వెళ్లి అనుకోకుండా అక్కడ తన గన్ పోగొట్టుకుంటాడు. దాంతో హైయ్యర్ అఫీషియల్స్ కార్తిని మందలించి.. వారం రోజుల్లో గన్నుతో పాటు డ్రగ్ డీలర్‌ను కూడా పట్టుకోవాలని చెప్తారు. అదే సమయంలో బెంగళూరులోని ఓ జర్నలిజం కాలేజీలో మిస్సింగ్ కేసుల మీద తన ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటుంది సారా మహేశ్వర్ (అవికా గోర్). ఈ కేసు కోసం హైదరాబాద్ వచ్చిన సారా.. అక్కడ త‌న మాజీ ప్రియుడు కార్తీని కలుస్తుంది. వరసగా మిస్ అవుతున్న అమ్మాయిల కేసును కలిసి చేధిద్దామని చెప్తుంది సారా. మొదట్లో సారా చెప్పింది నమ్మకపోయినా.. ఆ తర్వాత కేసులో సీరియస్ నెస్ తెలిసి రంగంలోకి దిగుతాడు కార్తీ. ఆ తర్వాత ఏం జరిగింది..? మిస్ అవుతున్న అమ్మాయిలకు.. క్షుద్ర పూజలు నేర్చుకున్న విగాండకు ఏంటి సంబంధం అనేది అసలు కథ..

కథనం:

కొన్ని కథలు ఐడియాగా విన్నపుడు భలే ఎగ్జైటింగ్‌గా అనిపిస్తుంటాయి. అవి గానీ స్క్రీన్ మీదకు వస్తే అదిరిపోతుంది అనిపిస్తుంది. అచ్చం షణ్ముఖ సినిమాలాగే. సినిమా మొదలవ్వడమే ఒక హై ఉంటుంది. అడవులు, అక్కడ మనుషులు, ఓ గర్భవతి, పురుడు కోసం ఆమె కష్టపడటం, పుట్టిన పిల్లాడు ఆరు ముఖాలతో ఉండటం.. ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. షణ్ముఖుడిగా ఉన్న బాబును మామూలు మనిషి చేయడానికి తండ్రి క్షుద్ర పూజల వైపు వెళ్లడం అవన్నీ బాగానే అనిపిస్తాయి. అక్కడ్నుంచి కథ ఒక్కసారిగా కట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొస్తాడు. ఇక్కడ డ్రగ్స్ మాఫియా అంటూ మళ్లీ రొటీన్ సైడ్ తీసుకుంటుంది. మధ్య మధ్యలో క్షుద్ర పూజలు, ఆ షణ్ముఖ అవతారం చూపిస్తుంటారు. మళ్లీ హీరోయిన్ కథలోకి వచ్చిన తర్వాత కాస్త వేగం అందుకుంటుంది. మిస్సింగ్ కేసులపై హీరోయిన్ థీసెస్ రాస్తుండటంతో.. హీరో అందులోకి రావడం.. మళ్లీ మధ్యలోనే వాళ్ల ప్రేమకథ.. ఇవన్నీ ఫాస్టుగానే చూపించాడు దర్శకుడు షణ్ముగం. ఇంటర్వెల్ వరకు వేగంగానే వెళ్తుంది కథ. సెకండాఫ్ కాస్త ల్యాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. మరీ ఎక్కువగా సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారని అర్థమవుతుంది. సెకండాఫ్‌లో కార్తీ, సారా ఇన్‌వెస్ట్‌గేష‌న్ చుట్టూ తిర‌గ‌డంతో మళ్లీ కథ గాడిన పడుతుంది. ఆ త‌ర్వాత ట్విస్ట్‌లు ఒక్కొక్కటిగా బయటికి వస్తుంటే కథపై ఓ క్లారిటీ వస్తుంది. క్షుద్ర పూజలు చేసే మాంత్రికులు, వాళ్లు చేసే పూజలపై దర్శకుడు ఇంకాస్త స్టడీ చేసుంటే బాగుండేది. సాదాసీదాగా అనిపిస్తుంది ఆ ఎపిసోడ్ అంతా. కథకు ఎంతో కీలకమైన ఆ ఎపిసోడ్‌ను జస్ట్ అలా తీసేసాడు దర్శకుడు. హీరో, హీరోయిన్ మధ్య రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులకు కాస్త రిలీఫ్. సీరియస్‌గా సాగిపోతున్న సినిమాలో ఇది ఓకే అనిపిస్తుంది. మరీ సూపర్ కాదు గానీ హార్రర్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు షణ్ముఖ పర్లేదనిపిస్తుంది.

నటీనటులు:

ఆది సాయికుమార్ పోలీస్ ఆఫసీర్‌గా బాగా నటించాడు. ఫిజిక్ కూడా బాగా మెయింటేన్ చేసాడు. అయితే మెయిన్ స్టోరీ అంతా మరో విషయంపై జరగడంతో ఆది క్యారెక్టర్ అందులో భాగంగానే మూవ్ అవుతూ ఉంటుంది. అవికా గోర్ ఓకే.. ఉన్నంత వరకు బాగా నటించింది. చిరాగ్ జానీ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్. మనోడి క్యారెక్టర్ బాగా పేలింది. అలాగే ఆదిత్య ఓం కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నికల్ టీం:

రవి బస్రూర్ సంగీతం ఈ సినిమాకు మెయిన్ హైలైట్. పాటలతో పాటు ఆర్ఆర్ కూడా అదరగొట్టాడు రవి. ముఖ్యంగా క్లైమాక్స్ సాంగ్ చాలా బాగుంది. ఎడిటింగ్ కాస్త క్రిస్పీగా ఉంది.. సినిమా కేవలం 2 గంటలే ఉంది. కానీ అక్కడక్కడా ల్యాగ్ తప్పలేదు. సినిమాటోగ్రఫీ వర్క్ ఓకే. దర్శకుడు షణ్ముగం అనుకున్న ఐడియా అద్భుతంగా ఉన్నా.. తీసిన విధానంలో కాస్త తడబడ్డాడు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా షణ్ముఖ.. డివోషనల్ హార్రర్ థ్రిల్లర్.. కండీషన్స్ అప్లై..!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..