Ranveer Singh: ఆగిపోతున్న సినిమాలు.. రణ్‌వీర్ కెరీర్‌కి ఏమైంది ??
రణ్‌వీర్ సింగ్ రెమ్యునరేషన్ ఎంత? ఆయన సినిమాల బడ్జెట్ ఎంత? మార్కెట్ వేల్యూ ఎంత? బిజినెస్ ఎంత... ఎంత.. ఎంత.. ఎంత... ఇప్పుడు ఇదే డిస్కషన్ జోరుగా సాగుతోంది నార్త్ ఇండస్ట్రీలో. ఒకటో, రెండో అయితే ఫర్లేదుగానీ.. పదే పదే ప్రాజెక్టులు ఆగిపోతుంటే అందరూ ఈ విషయాల గురించే డిస్కషన్ షురూ చేశారు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Mar 21, 2025 | 7:55 PM

రణ్‌వీర్ సింగ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అపరిచితుడు స్పాట్ పడగానే విషయమేంటో అర్థమైపోయే ఉంటుందిగా.. యస్.. శంకర్ డైరక్షన్‌లో అపరిచితుడు రీమేక్‌లో రణ్‌వీర్ సింగ్ నటిస్తారని ఆ మధ్య వార్తలు తెగ గుప్పుమన్నాయి.

కానీ ఇప్పటికైతే ఆ ప్రాజెక్ట్ ముందడుగు ప్రశ్నార్థకంగానే మారింది. కరణ్ జోహార్‌తో రణ్‌వీర్ చేస్తారన్న తక్త్ కూడా మూల పడింది. అటు బైజు బవ్రాలోనూ రణ్‌వీర్ నటిస్తారనే టాక్ విపరీతంగా స్ప్రెడ్ అయింది.

సంజయ్ లీలా భన్సాలీ డైరక్షన్‌లో రణ్‌వీర్ చేస్తారని అంతా అనుకున్నారు కానీ, అది కూడా చడీచప్పుడు చేయడంలేదిప్పుడు. డాన్ 3 గురించి అందరూ గట్టిగా మాట్లాడుకుంటున్నప్పుడు అంతకన్నా గట్టిగా వైరల్ అయింది రణ్‌వీర్ పేరు.

డాన్ 3 లాంటి సబ్జెక్టు అతన్ని వెతుక్కుంటూ రావడం అదృష్టం అని అనుకున్నారంతా. కానీ, అవన్నీ మాటల వరకే ఆగిపోయాయి. ఎక్కడిదాకో ఎందుకు? హనుమాన్ డైరక్టర్ ప్రశాంత్ వర్మ.. రణ్‌వీర్‌తో సినిమా చేస్తారనే టాక్ ఆ మధ్య స్పీడ్‌గా స్ప్రెడ్ అయింది.

కారణాలు బయటకు రాలేదుగానీ ఆ ప్రాజెక్టు లేదన్న మాట మాత్రం గట్టిగానే వినిపిస్తోంది. రణ్‌వీర్ యాటిట్యూడ్, రెమ్యునరేషన్, బడ్జెట్, బిజినెస్... ఇవన్నీ ఈ ప్రాజెక్టులు షెల్వ్ కావడానికి రీజన్ అంటున్నారు నార్త్ క్రిటిక్స్.





























