Nikhil: కార్తికేయ3కి స్క్రిప్ట్ రెడీ చేస్తున్న చందు మొండేటి
కొన్ని సినిమాల గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా, క్రేజ్ అదే రేంజ్‌లో ఉంటుంది. గ్రాఫ్ పైపైకే వెళ్తుంటుంది. అలాంటి సినిమాల్లో కార్తికేయ సీరీస్ కచ్చితంగా ఉండి తీరుతుంది. ఫస్ట్ పార్టుకీ, సెకండ్ పార్గుకీ ఎంత తేడా ఉన్నా.. సెకండ్ పార్టుకీ, థర్డ్ పార్టుకీ బడ్జెట్ పెరిగినా.... బేఫికర్ అంటారు మూవీ లవర్స్. వారికి కావాల్సిందల్లా.. త్రీక్వెల్ షురూ అయ్యేదెప్పుడు అన్నదే..
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Mar 21, 2025 | 7:21 PM

తండేల్ సక్సెస్ మీదున్నారు చందు మొండేటి. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమాను శ్రీకాకుళం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించి సక్సెస్ అందుకున్నారు చందు మొండేటి. ఇదే జోష్‌లో కార్తికేయ2 కోసం కథ రాస్తున్నారన్నది తాజా ఖబర్. ఈ విషయాన్ని చెప్పింది ఇంకెవరో అయితే.. అంత హైప్ ఉండేది కాదేమో.. చెప్పింది ఆ సబ్జెక్ట్ హీరో నిఖిల్.

కార్తికేయ సీక్వెల్‌కి ఎంత పేరు వచ్చిందో, అంతకు మించి త్రీక్వెల్ మీద హోప్స్ పెట్టుకోవచ్చంటున్నారు నిఖిల్. చందు మొండేటి చెప్పిన లైన్ ఎగ్జయిటింగ్‌గా అనిపించిందన్నది హీరో మాట.

అసలే కార్తికేయ త్రీక్వెల్ ఎలా ఉంటుందా? అని సస్పెన్స్ ని భరిస్తున్న ఫ్యాన్స్.. ఈ మాటతో ఊహల్లో తేలిపోవడం గ్యారంటీ. ఈ సారి ఎలాంటి సబ్జెక్టును టచ్ చేస్తారోననే చర్చ ఆల్రెడీ షురూ అయింది.

చందు మొండేటి కార్తికేయ స్క్రిప్ట్ పూర్తి చేసే లోపు... తాను ది ఇండియా హౌస్ పనులను కంప్లీట్ చేసేస్తానని అంటున్నారు నిఖిల్. ఆయన కెరీర్‌లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది ది ఇండియా హౌస్. ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో జరిగే కథతో తెరకెక్కిస్తున్నారు.

నిఖిల్ ప్రస్తుతం స్వయంభు సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 95 శాతం పూర్తయిందట. చాలా వరకు షూటింగ్‌ని సీక్రెట్‌గానే చేసినట్టు తెలిపారు నిఖిల్. చారిత్రాత్మక అంశాలతో ముడిపడిన కథతో తెరకెక్కుతోంది స్వయంభు మూవీ. ఈ సినిమా మీద చాలా హోప్స్ ఉన్నాయన్నది హీరో చెబుతున్న మాట.





























