మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj). ఇటీవల విజయ్ తలపతి ప్రధాన పాత్రలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన మాస్టర్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చి ఖైదీ మూవీ సైతం పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు విశ్వనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రధాన పాత్రలో నటించిన విక్రమ్ (Vikram) సినిమా సైతం ఘన విజయం సాధించింది. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలలో నటించిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా చాలా కాలం తర్వాత వెండితెరపై కనిపించిన కమల్.. మరోసారి తన నటనతో అదుర్స్ అనిపించాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల వద్ద ఈ సినిమా భారీగా వసూళ్లు రాబడుతోంది. తాజాగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకుని రూ. 200 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. కేవలం ఐదు రోజుల్లోనే ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. దాదాపు రూ. 95.75 కోట్లతో రంగంలోకి దిగిన ఈ సినిమా ఇప్పుడు. రూ. 105.50 కోట్ల కలెక్షన్స్ సాధించి వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ విషయాన్ని ట్రేడ్ వర్గాల నిపుణుడు రమేష్ బాలా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు…
ఇదిలా ఉంటే.. కమల్ హాసన్ పై డైరెక్టర్ శంకర్ ప్రశంసలు కురిపించారు.. కమల్ నిజమైన లెజెండ్ అంటూ కితాబిచ్చారు. విక్రమ్ సినిమాలో కమల్ బిగ్ స్క్రీన్ పై 360 యాంగిల్ లో ఫైర్ అయ్యారని కొనియాడారు. అలాగే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని..నటీనటులు, సాంకేతిక నిపుణులను పొగడ్తలతో ముంచేత్తారు.
ట్వీట్..
#vikram Wow???great to see @ikamalhaasan sir on bigscreen firing 360° ???like a true LEGEND?.TREMENDOUS effort n style from @Dir_Lokesh ???engaging,highs in regular intervals @anirudhofficial THE REAL ROCKSTAR?❤️@anbariv – masters??Kudos to the actors&whole team ??
— Shankar Shanmugham (@shankarshanmugh) June 7, 2022