Shah Rukh Khan: ఆ ముగ్గురు నా సెట్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది.. షారుక్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

షారుక్ లైనప్ చేసిన సినిమాల్లో జవాన్ ఒకటి.. మరొకటి పఠాన్. వీటిలో అట్లీ దర్శకత్వంలో షారుక్ జవాన్ సినిమా చేస్తున్నాడు.

Shah Rukh Khan: ఆ ముగ్గురు నా సెట్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది.. షారుక్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Shahrukh Khan
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 08, 2022 | 4:19 PM

బాలీవుడ్ కాంగ్ ఖాన్ షారుక్ ఖాన్ చాలా కాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. షారుక్ లైనప్ చేసిన సినిమాల్లో జవాన్ ఒకటి.. మరొకటి పఠాన్. వీటిలో అట్లీ దర్శకత్వంలో షారుక్ జవాన్ సినిమా చేస్తున్నాడు. చివరిగా జీరో సినిమాతో ప్రేక్షకులముందుకు వచ్చాడు షారుక్. అయితే రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాతర్వాత షారుక్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినప్పటికీ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు షారుక్. అయితే షారుక్ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో షారుక్ సరసన లేడీ సూపర్ స్టార్ నాయన తార నటిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

తాజాగా ఈ సినిమా గురించి షారుక్ తన సోషల్ మీడియాలో ప్రస్తావించారు. ట్విట్టర్ వేదికగా షారుక్ స్పందిస్తూ.. తన సినిమా షూటింగ్ చాలా సంతోషంగా గడిచిందని.. తన సినిమా సెట్ కు సూపర్ స్టార్ రజినీకాంత్, దళపతి విజయ్, విజయ్ సేతుపతి వచ్చారని చాలా సంతోషంగా ఉందని అన్నారు. రజనీకాంత్ తదుపరి చిత్రం జైలర్ సెట్ షారూక్ నటిస్తున్న సెట్ కి చాలా సమీపంలోనే ఉంది. దాంతో రజినీకాంత్ షారుక్ ను కలిశారట.

ఇవి కూడా చదవండి

ఇక రజనీకాంత్ జవాన్ సెట్ కు రావడం… నయనతార తనతో కలిసి సినిమా చూడటం.. విజయ్ సేతుపతి తనతో మాట్లాడటం.. ధళపతి విజయ్ తనకు ఆహారం ఇవ్వడం…అనిరుధ్ రవిచందర్ తో కలిసి డ్యాన్స్ చేయడం ఇలా తన ఇలా మెమరబుల్ విషయాల గురించి షారుక్ ప్రస్తావించారు. చెన్నైలో గొప్ప ఆతిథ్యం ఇచ్చినందుకు దర్శకుడు అట్లీ అతని భార్య ప్రియకు కృతజ్ఞతలు తెలిపారు షారుక్. ఇక ఈ సినిమా 2 జూన్ 2023న విడుదల కానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.