Pathaan : ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డును బీట్ చేసిన షారుక్ ఖాన్ పఠాన్..

అమెరికా బాక్సాఫీస్ వద్ద కూడా అరుదైన రికార్డును పఠాన్ సొంతం చేసుకుంది.ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.

Pathaan : ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డును బీట్ చేసిన షారుక్ ఖాన్ పఠాన్..
Shah Rukh Khan's Pathaan
Follow us

|

Updated on: Feb 11, 2023 | 12:00 PM

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగెస్ట్ హిట్ గా నిలిచింది. అమెరికా బాక్సాఫీస్ వద్ద కూడా అరుదైన రికార్డును పఠాన్ సొంతం చేసుకుంది.ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. విడుదలకు ముందు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే పఠాన్‌ సినిమా లోని కొన్ని దృశ్యాలపై హిందూ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినా కూడా ఆ వివాదాలను దాటి పఠాన్ సినిమా విడుదలై మంచి హిట్ గా నిలిచింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఆర్ఆర్ఆర్ ను క్రాస్ చేసిందని తెలుస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో కూడా ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద 14.9 మిలియన్ డాలర్లను వసూళ్లు చేసింది. కాగా పఠాన్ సినిమా 14.95 మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు చేసినట్లుగా చిత్ర యూనిట్ అనౌన్స్ చేశారు.

ప్రముఖ ఓటీటీ సంస్థ ‘పఠాన్’ డిజిటల్ రైట్స్ కోసం రూ.100 కోట్లు ఆఫర్ చేసిందట. భారీ ధర కావడంతో నిర్మాతలు కూడా ఈ డీల్ కు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. వరల్డ్ వైడ్ గా 7700 స్క్రీన్స్ లో విడుదలైంది ఈ సినిమా.