Shah Rukh Khan: షారుఖ్‌ ఖాన్‌కి అస్వస్థత.. కింగ్ షూటింగ్ వాయిదా..

బాలీవుడ్‌ స్టార్ హీరో షారుక్‌ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న కింగ్‌ సినిమా షూటింగ్‌లో ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. షారుఖ్ కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. అయితే అత్యవసర చికిత్స నిమిత్తం షారుక్‌ అతని బృందం అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది.

Shah Rukh Khan: షారుఖ్‌ ఖాన్‌కి అస్వస్థత.. కింగ్ షూటింగ్ వాయిదా..

Updated on: Jul 19, 2025 | 1:39 PM

బాలీవుడ్‌ స్టార్ హీరో షారుక్‌ఖాన్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న కింగ్‌ సినిమా షూటింగ్‌లో ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. షారుఖ్ కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. అయితే అత్యవసర చికిత్స నిమిత్తం షారుక్‌ అతని బృందం అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. కింగ్ సినిమా కోసం ఓ యాక్షన్‌ సన్నివేశంలో డూప్‌ లేకుండా స్టంట్‌ చేస్తుండగా ఆయన అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం జరుగుతోన్న ‘కింగ్‌’ షూటింగ్‌ను సెప్టెంబర్‌కు వాయిదా వేసినట్లు కూడా వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

పఠాన్, జవాన్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న షారుఖ్ ఖాన్.. ఇప్పుడు తన కూతురు సుహానా ఖాన్ తో కలిసి కింగ్ చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ కథా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుండగా.. ఇందులో సుహానా ఖాన్ తల్లి పాత్రలో సీనియర్ హీరోయిన్ రాణి ముఖర్జీ నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి: Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..

ఇవి కూడా చదవండి

Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..

Telugu Cinema: టాలీవుడ్‏లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి సుప్రీం కోర్టు లాయర్‏గా.. ఎవరంటే..

Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..