Shaakuntalam: సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. శాకుంతలం సినిమా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.
గుణ శేఖర్ రూపొందించిన పౌరాణిక ప్రేమ కావ్యం ‘శాకుంతలం’. ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా తెరకెక్కించే గుణ శేఖర్ మరోసారి ‘శాకుంతలం’ వంటి విజువల్ వండర్‌తో పాన్ ఇండియా..
అందాల భామ సమంత నటిస్తోన్న లేటెస్ట్ మూవీ శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందించిన పౌరాణిక ప్రేమ కావ్యం ‘శాకుంతలం’. ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా తెరకెక్కించే గుణ శేఖర్ మరోసారి ‘శాకుంతలం’ వంటి విజువల్ వండర్‌తో పాన్ ఇండియా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయటానికి సిద్ధమవుతున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ పెద్ద ఎత్తున సాగుతున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చిన్న పాటి కన్ఫ్యూజన్ చోటు చేసుకుంది. ముందుగా ఈ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత వాయిదా వేశారు. దాంతో సమంత ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు.
తాజాగా శాకుంతలం మూవీ న్యూ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది చిత్రయూనిట్. శాకుంతలం సినిమాను ఏపిల్ 14న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలను మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సాంగ్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి.
మలయాళీ యాక్టర్ దేవ్ మోహన్, డా.మోహన్ బాబు, సచిన్ కేడ్‌కర్, గౌతమి, మధుబాల, ప్రకాష్ రాజ్, కబీర్ బేడి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, వర్షిణి సౌందరరాజన్ వంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటిస్తున్నారు.
View this post on Instagram