ఈ విచిత్ర జంతువును చూశారా ?? గుడ్లు పెట్టి.. పాలు ఇస్తుంది
ప్లాటిపస్ బాతు ముఖం, సీల్ శరీరం కలిగిన విచిత్రమైన క్షీరదం. ఇది గుడ్లు పెడుతూ, పాలిచ్చే అరుదైన జీవి. ఆస్ట్రేలియాలో కనిపించే ఈ ప్లాటిపస్ విషపూరితమైనది. దీని విషం ప్రాణాంతకం కానప్పటికీ తీవ్ర నొప్పిని కలిగిస్తుంది. శాస్త్రవేత్తలు దీని విషం నుండి కొత్త నొప్పి నివారణ, డయాబెటిస్ మందులను అభివృద్ధి చేయడానికి పరిశోధనలు చేస్తున్నారు.
ప్రపంచంలో అనేక వింత జీవులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ప్లాటిపస్. ముఖం బాతులా, శరీరం సీల్ చేపలా చూడటానికి ఎంతో విచిత్రంగా ఉంటుంది. ఇది క్షీరద జాతికి చెందిన జీవి. ఇది పాలిచ్చి పెంచే జంతువు అయినప్పటికీ.. గుడ్లను కూడా పెడుతుంది. ఇలాంటి మిశ్రమ జాతి జీవులు ప్రపంచంలో ఐదు రకాలు మాత్రమే ఉన్నాయి. ప్లాటిపస్ 113 మిలియన్ సంవత్సరాల నాటి నుంచి ఉనికినిలో ఉందని గుర్తించారు. 1799లో తొలిసారి ప్లాటిపస్ శాస్త్రవేత్తల కంటికి చిక్కింది. దానిని చూడగానే వారు తెగ ఆశ్చర్యపోయారు. దాని శరీరం, ముఖం ఎంతో వింతగా.. పొంతన లేని విధంగా కనిపించింది. ఇలాంటి జీవి భూమిపై ఉందనే విషయాన్ని నమ్మలేకపోతున్నామన్నారు. ప్లాటిపస్‌లు ఆస్ట్రేలియాలోని నదులు, వాగుల్లో నివసిస్తాయి. వీటి మరో ప్రత్యేకత ఏమిటంటే ఇవి విషం కలిగిన స్తన్యజంతువులు కావడం. సాధారణంగా మనం విషం అంటే పాములు, తేళ్లను గుర్తుకు తెచ్చుకుంటాం. కానీ మగ ప్లాటిపస్‌ల వెనుక కాళ్ల దగ్గర పదునైన ముళ్లు ఉంటాయి. ప్లాటిపస్ ఇతర జీవుల నుంచి రక్షణ కోసం విషం విరజిమ్ముతుంది. ఆ విషంలో కనీసం 19 రకాల ప్రత్యేక రసాయనాలు ఉన్నాయని కనుగొన్నారు. కొన్ని రసాయనాలైతే ప్రపంచంలో మరే ఇతర జంతువుల్లోనూ లేవట. అయితే ఈ విషం మనుషులకు ప్రాణాంతకం కాదు. చాలా తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది అంతే. ప్లాటిపస్ విషానికి గురైనవారు ‘ఎముక విరిగిన దానికంటే ఎక్కువ నొప్పి’ కలిగినట్లు చెబుతారు. కొన్నిసార్లు ఆ నొప్పి వారాలు లేదా నెలల పాటు కొనసాగుతుందట. దీనికి ఇప్పటివరకు విరుగుడు మందు ఏదీ లేదు. ఈ విషం భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. శాస్త్రవేత్తలు దీని ద్వారా కొత్త నొప్పి నివారణ మందులు, డయాబెటిస్ మందుల తయారీకి సంబంధించిన పరిశోధనలు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మ్మానాన్నలకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన యూట్యూబర్
రోజుకు రూ.21 వేల సంపాదన.. జస్ట్ అదే చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్
భారతీయ రైల్వేలో పెను మార్పు.. ఇకపై LNGతో రైళ్ల ప్రయాణం
నడిరోడ్డుపై షాకింగ్ సీన్.. ఆవు తో మందు బాబు చేసిన పనికి అందరికీ మైండ్ బ్లాక్
బిచ్చగాడి ఆస్తి చూసి అంతా షాక్ !! ఇనప్పెట్టె తీస్తే నోట్ల కట్టలు
ఏ బిడ్డా.. ఇది నా అడ్డా.. కవ్వాల్ అభయారణ్యంలో అడవి దున్న
ప్రపంచ రికార్డు సృష్టించిన అత్యంత పెద్ద నత్త ను చూసారా ??
అసలు ఆమె తల్లేనా ?? తాగిన మత్తులో 12 ఏళ్ల కొడుక్కి వింత శిక్ష
నగరాభివృద్ధికి 21 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన దాత
గోమాత మాతృ హృదయం.. మేకపిల్ల ఆకలి తీర్చి..
మంత్రగత్తె అనుమానంతో.. మహిళకు నిప్పంటించిన మూక

