AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజుకు రూ.21 వేల సంపాదన.. జస్ట్‌ అదే చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్‌

రోజుకు రూ.21 వేల సంపాదన.. జస్ట్‌ అదే చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్‌

Phani CH
|

Updated on: Feb 03, 2026 | 12:40 PM

Share

చిన్నచిన్న వ్యాపారాలతో భారీ ఆదాయం ఎలా సంపాదించవచ్చో ఈ కథనం వివరిస్తుంది. టీ, టిఫిన్ సెంటర్ల మాదిరిగానే, ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ పర్వత ప్రాంతంలో మ్యాగీ అమ్మి ఒకే రోజులో ₹21,000 సంపాదించాడు. చల్లని వాతావరణంలో వేడి మ్యాగీకి పర్యాటకుల నుండి విశేష స్పందన లభించింది. ఖర్చులన్నీ పోగా రోజుకు ₹8,000 నికర లాభం వచ్చినట్లు నిపుణులు అంచనా. ఇది స్వయం ఉపాధికి గొప్ప ఉదాహరణ.

చిన్న పనులు చేస్తూ.. భారీగా డబ్బులు సంపాదించే బిజినెస్‌లు ఉంటాయి. టీ, పాన్ షాప్, టిఫిన్ సెంటర్, పానీపూరీ బండి పెట్టుకుని.. చాలా మంది స్వయం ఉపాధి పొందడమే కాకుండా ఇతరులకు కూడా ఉపాధి కల్పిస్తూ.. ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. పెద్ద పెద్ద చదువులు చదువుకుని.. క్యాబ్‌లలో ఆఫీసుకు వెళ్లి.. పెద్ద పెద్ద అద్దాల మేడల్లో, ఏసీ రూమ్‌లలో కూర్చొని నెలంతా కంప్యూటర్ ముందు కష్టపడితే తిప్పికొట్టినా రూ.20 వేలు రాని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఎంతో మంది ఉంటారు. కానీ ఓ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ . ఒకే రోజులో ఏకంగా రూ.21 వేలు సంపాదించడంపై నెట్టింట చర్చ జరుగుతోంది. అది కూడా మ్యాగీ విక్రయించి.. అంత డబ్బు సంపాదించానని ఆ వ్యక్తి వీడియో చేసి అప్‌లోడ్ చేయడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. పర్వత ప్రాంతాలు చూసేందుకు వచ్చే టూరిస్ట్‌లకు ఒక రోజు మొత్తం మ్యాగీ చేసి అమ్మడం ద్వారా భారీగా ఆదాయం పొందవచ్చని బాదల్ ఠాకూర్ నిరూపించాడు. కష్టపడి కొండ ప్రాంతాలకు వచ్చే టూరిస్ట్‌లకు సరదాగానో లేక ఆకలిగా ఉన్నప్పుడో ఏదో ఒక స్నాక్ అందిస్తే.. దాని వల్ల భారీగా సంపాదించవచ్చని తెలిపాడు. నార్మల్ మ్యాగీని ప్లేట్‌కు 70 రూపాయల చొప్పున.. చీజ్ మ్యాగీని 100 చొప్పున విక్రయించాడు. ఒక రోజులో సుమారు 300 నుంచి 350 ప్లేట్లు అమ్మాడు. దీంతో ఆ రోజులో మొత్తం వసూళ్లు సుమారు రూ.21 వేలు వచ్చినట్లు బాదల్ ఠాకూర్ తెలిపాడు. అతని వీడియోకు 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. చల్లని కొండ ప్రాంతాల్లో వేడివేడి మ్యాగీ అంటే పర్యాటకులు బాగా ఎగబడతారని.. అదే ఈ అమ్మకాలకు ప్రధాన కారణమని అన్నారు. అయితే రూ.21 వేల ఆదాయం ఒకే రోజులో రాగా.. అందులో నికర లాభం తక్కువని తెలిపారు. మ్యాగీ ప్యాకెట్లు, గ్యాస్ సిలిండర్, నీరు, ప్లేట్లు.. వాటిని కొండపైకి తీసుకువెళ్లేందుకు అయ్యే ఖర్చు.. -10 డిగ్రీల చలిలో రోజంతా నిలబడి పని చేయడం.. అతనికి సహాయం చేసిన అసిస్టెంట్లకు ఇచ్చే ఖర్చులు అన్నీ కలిపి తీసేస్తే రోజుకు సుమారు రూ.8 వేల వరకు లాభం ఉండవచ్చని ఒక నెటిజన్ లెక్క కట్టారు. ఇది కూడా చాలా మంచి ఆదాయమే అయినప్పటికీ.. పర్వత ప్రాంతాల్లో నిత్యం రోజంతా అలా పని చేయడం చాలా కష్టమని అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారతీయ రైల్వేలో పెను మార్పు.. ఇకపై LNGతో రైళ్ల ప్రయాణం

నడిరోడ్డుపై షాకింగ్‌ సీన్.. ఆవు తో మందు బాబు చేసిన పనికి అందరికీ మైండ్ బ్లాక్

బిడ్డకు పాలిస్తున్న తల్లి.. క్షణాల్లో..

ఏపీ సహా 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ కోసం పథకం

ఆలయంలో నాగుపాము.. భక్తుల్లో భయం

Follow Us