భారతీయ రైల్వేలో పెను మార్పు.. ఇకపై LNGతో రైళ్ల ప్రయాణం
భారతీయ రైల్వే పర్యావరణ పరిరక్షణలో కీలక మైలురాయిని అధిగమించింది. అహ్మదాబాద్ విభాగం ఎల్‌ఎన్‌జి-డీజిల్ మిశ్రమ ఇంధనంతో నడిచే డెము రైళ్లను ప్రవేశపెట్టింది. దేశంలోనే మొదటిసారిగా ఈ డ్యూయల్ ఫ్యూయల్ సిస్టమ్ 40% డీజిల్ ఆదా చేసి, కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. ఇది పర్యావరణ హితమైన, ఖర్చు తగ్గించే రైల్వే ప్రయాణానికి మార్గం సుగమం చేస్తుంది.
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా భారతీయ రైల్వే మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. డీజిల్ వినియోగాన్ని తగ్గించి, కాలుష్య రహిత ప్రయాణాన్ని అందించే దిశగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG), డీజిల్ మిశ్రమ ఇంధనంతో నడిచే డెమూ (DEMU) రైళ్లను అహ్మదాబాద్ రైల్వే విభాగం విజయవంతంగా ప్రవేశపెట్టింది. దేశంలోనే ఈ తరహా సాంకేతికతతో నడుస్తున్న మొదటి రైలు ఇదే కావడం విశేషం. ఈ వినూత్న ప్రాజెక్టులో భాగంగా 1400 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన డెమూ రైలును ‘డ్యూయల్ ఫ్యూయల్’ వ్యవస్థకు మార్చారు. దీనివల్ల రైలుకు అవసరమైన మొత్తం ఇంధనంలో 40 శాతం డీజిల్‌ను ఆదా చేసి, ఆ స్థానంలో పర్యావరణహిత ఎల్‌ఎన్‌జీని వినియోగిస్తారు. సుమారు 2 వేల కిలోమీటర్ల మేర నిర్వహించిన ట్రయల్ రన్స్ విజయవంతం కావడంతో, ప్రస్తుతం ఇవి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. డీజిల్ వాడకం తగ్గడం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది.విదేశాల నుంచి దిగుమతి చేసుకునే డీజిల్ భారం తగ్గి, నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుంది. ఈ సాంకేతిక మార్పులు భారతీయ రైల్వే ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. భవిష్యత్తులో మరిన్ని రైళ్లను ఈ విధానంలోకి మార్చడం ద్వారా రైల్వే రంగాన్ని పూర్తి పర్యావరణ అనుకూల శక్తిగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నడిరోడ్డుపై షాకింగ్ సీన్.. ఆవు తో మందు బాబు చేసిన పనికి అందరికీ మైండ్ బ్లాక్
బిడ్డకు పాలిస్తున్న తల్లి.. క్షణాల్లో..
ఏపీ సహా 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ కోసం పథకం
ఈ విచిత్ర జంతువును చూశారా ?? గుడ్లు పెట్టి.. పాలు ఇస్తుంది
మ్మానాన్నలకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన యూట్యూబర్
రోజుకు రూ.21 వేల సంపాదన.. జస్ట్ అదే చేసిన ఇన్ఫ్లూయెన్సర్
ఆవు తో మందు బాబు చేసిన పనికి అందరికీ మైండ్ బ్లాక్
బిడ్డకు పాలిస్తున్న తల్లి.. క్షణాల్లో..
ఆలయంలో నాగుపాము.. భక్తుల్లో భయం
బాబోయ్ పులి.. ఎమ్మెల్యే బుచ్చయ్య ముందునుంచే వెళ్లి

