నడిరోడ్డుపై షాకింగ్ సీన్.. ఆవు తో మందు బాబు చేసిన పనికి అందరికీ మైండ్ బ్లాక్
పశ్చిమగోదావరి జిల్లాలో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఆకలితో రోడ్డుపై ఉన్న ఆవు పొదుగు పితికి పాలు తాగడం చూసి స్థానికులు నివ్వెరపోయారు. మొదట గమనించకపోయినా, చాలాసేపటికి అతని చేష్టలు చూసి ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. రోడ్డుపై బహిరంగంగా ఇలా ప్రవర్తించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడంతో, హెచ్చరికల అనంతరం ఆ వ్యక్తి అక్కడినుంచి జారుకున్నాడు.
ఇలాంటోళ్లు కూడా ఉంటారా? అని స్థానికులు ముక్కున వేలేసుకునేలా విచిత్ర సంఘటన ఒకటి పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. సాధారణంగా రోడ్డుపక్కన జామ, మామిడి చెట్లకు కాయలు కనిపిస్తే కొందరు కోసుకుని తింటారు. కానీ ఏకంగా నడిరోడ్డుపై నిలబడి ఉన్న ఆవు పొదుగునుంచి పాలు పితికి తాగాడు ఓ వ్యక్తి. అతని చేష్టలు చూసి జనం నివ్వెరపోయారు. ఆకలి వేసిందని చెప్పుకుంటూ మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి, రోడ్డుపైనే ఆవు కాళ్ల దగ్గర కూర్చుని పొదుగు పితుక్కుంటూ పాలు తాగాడు. మొదట అతడిని ఎవరూ గమనించకపోయినా, చాలాసేపటికి అతడు అక్కడినుంచి ఎంతకీ కదలకపోవడంతో స్థానికులు గమనించి వారించారు. అతడి ప్రవర్తన చూసి రోడ్డుపై వెళ్తున్నవారు నిశ్చేష్టులయ్యారు. ఆవు సాధు జంతువు కావడంతో ఏమాత్రం ప్రతిఘటించలేదు. కానీ ఆకలితో ఉన్న ఆవుకు గుప్పెడు గడ్డి కూడా వేయని వ్యక్తి, అందునా బహిరంగంగా ఇలా ప్రవర్తించడం పలువురిని ఆగ్రహానికి గురిచేసింది. “మళ్లీ కనిపిస్తే తాట తీస్తాం” అని స్థానికులు హెచ్చరించడంతో ఆ వ్యక్తి మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బిడ్డకు పాలిస్తున్న తల్లి.. క్షణాల్లో..
ఏపీ సహా 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ కోసం పథకం
ఆలయంలో నాగుపాము.. భక్తుల్లో భయం
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

