వ్యాయాయాలు చేసినట్టు ఊహించుకున్నా సేమ్ బెనిఫిట్స్
శారీరక వ్యాయామం చేయకుండానే, కేవలం మనసులో ఊహించుకోవడం ద్వారా కండరాల బలాన్ని పెంచుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. మెదడులోని మోటార్ సర్క్యూట్లు ఉత్తేజితమై, న్యూరోమస్క్యులర్ కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. ఇది గాయపడినవారికి లేదా వృద్ధులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది, అయితే ఇది పూర్తి భౌతిక వ్యాయామానికి ప్రత్యామ్నాయం కాదని నిపుణులు సూచిస్తున్నారు.
వ్యాయామాలు చేయడం మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. కానీ నిజంగా చేయకపోయినా.. చేసినట్టు ఊహించుకున్నా కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని లూసియానా స్టేట్ యూనివర్సిటీ నిపుణుల అధ్యయనం తెలిపింది. శారీరక వ్యాయామం చేయలేని పరిస్థితుల్లో చేసినట్టు ఊహించుకోవడం వల్ల మెదడులోని మోటార్ సర్క్యూట్లు ఉత్తేజితం అవుతాయని తెలిపాయి. జిమ్‌లో కాదండోయ్.. మనసులో వ్యాయామాలు చేయడం వల్ల కూడా కండరాల బలం పెరుగుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. శారీరక వ్యాయామం చేయకుండా, కేవలం మనసులో విజువలైజ్ చేయడం ద్వారా మెదడులోని మోటార్ సర్క్యూట్లు ఉత్తేజితమవుతాయట. ఎందుకంటే ఈ పరిస్థితి నిజమైన లిఫ్టింగ్ చేసినట్లుగా కండరాలకు సిగ్నల్స్ పంపుతుందని, దీంతో కండరాలు ప్రతిస్పందిస్తాయని చెబుతున్నారు. వ్యాయామాలను మనసులో ఊహించుకున్న వారి బ్రెయిన్ స్కాన్లు మెదడు యాక్టివిటీని చూపించాయి. ఈ మెంటల్ ట్రైనింగ్ న్యూరోమస్క్యులర్ అడాప్టేషన్ ద్వారా పనిచేస్తుంది. అంటే మెదడు, కండరాల మధ్య కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. హిప్ ఫ్లెక్షన్ ఎక్సర్‌సైజ్‌ను మనసులో ఊహించుకున్నవారు నడుము బలాన్ని 24% పెంచుకున్నారట. భౌతికంగా చేసినవారు 28% పెంచుకున్నారు. అయితే తరచుగా కేవలం ఊహించుకోవడం ద్వారా మాత్రమే పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను పొందరు. ఇది రిహాబిలిటేషన్‌లో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా గాయాలు లేదా వృద్ధులకు వ్యాయామం కష్టమైనప్పుడు. ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి మెంటల్ ఇమేజరీ భౌతిక వ్యాయామానికి పూర్తి ప్రత్యామ్నాయం కాదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ విచిత్ర జంతువును చూశారా ?? గుడ్లు పెట్టి.. పాలు ఇస్తుంది
మ్మానాన్నలకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన యూట్యూబర్
రోజుకు రూ.21 వేల సంపాదన.. జస్ట్ అదే చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్
భారతీయ రైల్వేలో పెను మార్పు.. ఇకపై LNGతో రైళ్ల ప్రయాణం
నడిరోడ్డుపై షాకింగ్ సీన్.. ఆవు తో మందు బాబు చేసిన పనికి అందరికీ మైండ్ బ్లాక్
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..

