మంచి మనసు చాటుకున్న శ్రుతిహాసన్.. చిన్నారి ప్రాణాలు కాపాడిన అందాల తార
శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు అనగనగా ఒక రాజు సినిమాతో తెలుగు వెండితెర పైకి అడుగు పెట్టి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. మొదట్లో ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అవ్వడంతో ఐరన్ లెగ్ అంటూ అనేక వార్తలు వచ్చాయి.

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురు శ్రుతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది.కెరీర్ బిగినింగ్ లో హిట్ కోసం కష్టపడ్డ ఈ చిన్నదానికి ఇప్పుడు వరుస హిట్స్ వస్తున్నాయి. ఇటీవలే సలార్ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్ గా కూలి సినిమాతో ప్రేక్షకులను అలరించిన శ్రుతి.. ప్రస్తుతం సలార్ 2 సినిమాతో పాటు మరి కొన్ని క్రేజీ సినిమాల్లో నటిస్తుంది. తాజాగా ఓ చిన్నారికి అండగా నిలిచింది శ్రుతి హాసన్. దాంతో ఆమె అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. హీరోయిన్ గా దూసుకుపోతున్న శ్రుతి.. సమాజ సేవలోనూ తనవంతు సాయం చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే చిన్నారి పాలిట దేవతగా నిలిచింది.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారికి సాయం చేసింది శ్రుతి హాసన్. ఆ చిన్నారి ఆ వ్యాధిని జయించేలా చేసింది. ఆళ్వి అని చిన్నారికి పుట్టుకతోనే MSMD అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది. ఎన్నో హాస్పటల్స్ తిరిగినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఆ చిన్నారికి ముక మజ్జ మార్పిడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి ఎంతో డబ్బు కావాల్సి వచ్చింది. ఆ కుటుంబం ఆర్ధికంగా ఇబ్బందిపడుతున్న విషయం శ్రుతి హాసన్ వరకు చేరింది. దాంతో ఆ చిన్నారిని సాయం చేసుకునేందుకు శ్రుతి ముందుకు వచ్చింది.
కేవలం డబ్బు సాయం చేయడమే కాకుండా బెస్ట్ డాక్టర్స్ లో మాట్లాడి ఆ చిన్నారి ప్రాణం కాపాడింది. మెరుగైన వైద్యం అందించడంతో పాటి ఆ చిన్నారి కుటుంబానికి ధైర్యాన్ని నింపింది శ్రుతి. ఆ చిన్నారితో దిగిన ఫోటోలను, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్రుతి హాసన్. కాగా ఈరోజు మా పాప ఇలా ఈరోజు బ్రతికి ఉందంటే అది కేవలం శ్రుతి గారి వల్లే అంటున్నారు ఆ చిన్నారి తల్లిదండ్రులు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
