AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివిన ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా? మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు

ఈ టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో చెన్నైలో పుట్టినప్పటికీ ఎక్కువగా హైదరాబాద్ లోనే పెరిగాడు. హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నాడు. ఆ తర్వాత స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత విద్యను అభ్యసించాడు. ఆపై న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి పట్టభద్రుడయ్యాడు.

Tollywood: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివిన ఈ టాలీవుడ్ హీరోను గుర్తు పట్టారా? మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు
Tharun Bhascker family
Basha Shek
|

Updated on: Feb 03, 2026 | 9:26 PM

Share

పై ఫొటోను గమనించారా? అందులో ఉన్న తల్లి, కుమారులిద్దరూ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగ ఫేమస్. తల్లి సహాయక నటిగా మెప్పిస్తుంటే కొడుకు మాత్రం మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. హీరోగా, విలన్ గా, దర్శకుడిగా, సహాయక నటుడిగా.. ఇలా ఏపాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతున్నాడు. చాలా మంది లాగే ఇతను కూడా మొదట షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించాడు. యూబ్యూబర్ గా తన ట్యాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత మెగా ఫోన్ పట్టుకుని డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే ఏకంగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ తీసి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కేవలం దర్శకత్వంతోనే ఆగకుండా యాక్టింగ్ తోనూ ఇరగదీస్తున్నాడీ మల్టీ ట్యాలెంటెడ్. హీరోగా, విలన్ గా, సహాయక నటుడిగా మెప్పిస్తున్నాడు. ఈ శుక్రవారమే (జనవరి 30) ఇతను హీరోగా నటించిన ఒక సినిమా థియేటర్లలో విడుదలైంది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు ఇతని పేరు తెగ మార్మోగుతోంది. ఇలా తెలుగుతో మల్టీ ట్యాలెంట్ దూసుకెళుతోన్న ఆ స్టార్ ను గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమాతో మంచి హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్.

పెళ్లి చూపులు సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న తరుణ్ భాస్కర్ ఏమైంది ఈ నగరానికి సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఈ మూవీ తర్వాత నటునిగానే ఎక్కువగా కనిపిస్తున్నాడు తరుణ్. మహానటి, సమ్మోహనం, ఫలక్‌నుమాదాస్, మీకు మాత్రమే చెప్తా, మిడిల్ క్లాస్ మెలోడీస్, స్కై ల్యాబ్, సీతారామం, దాస్ కీ దమ్కీ, హాస్టల్ బాయ్స్, మంగళవారం, సంతాన ప్రాప్తిరస్తు వంటి ఎన్నో సినిమాల్లో వివిధ పాత్రలతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమాతో మరోసారి హీరోగా మెరిశాడు. ఇందులో ఓంకార్ నాయుడి పాత్రలో తరుణ్ అభినయం అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమా ప్రమోషన్లలో తరుణ్ భాస్కర్..

View this post on Instagram

A post shared by Eesha Rebba (@yourseesha)

ఇక తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్ కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ముఖ్యంగా ఫిదా సినిమాలో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

తల్లి గీతా భాస్కర్ తో తరుణ్ భాస్కర్..

View this post on Instagram

A post shared by Eesha Rebba (@yourseesha)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us