Shaakuntalam First Day Collections: ‘శాకుంతలం’ ఫస్ట్ డే కలెక్షన్స్.. మొదటిరోజు ఎన్ని కోట్లు రాబట్టిందంటే..

|

Apr 15, 2023 | 12:20 PM

శకుంతల, దుష్యంతుల ప్రేమకథను మరింత అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించాలని డైరెక్టర్ గుణశేఖర్ చేసిన ప్రయత్నమే ఈ సినిమా. విడుదలకు ముందు ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.

Shaakuntalam First Day Collections: శాకుంతలం ఫస్ట్ డే కలెక్షన్స్.. మొదటిరోజు ఎన్ని కోట్లు రాబట్టిందంటే..
Shaakunthalam
Follow us on

కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం శాకుంతలం. శకుంతల, దుష్యంతుల ప్రేమకథను మరింత అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించాలని డైరెక్టర్ గుణశేఖర్ చేసిన ప్రయత్నమే ఈ సినిమా. విడుదలకు ముందు ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇందులో శకుంతలగా సమంత.. దుష్యంతుడిగా మలయాళీ యంగ్ హీరో దుష్యంతుడు కనిపించగా.. వీరి కుమారుడు భరతుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ నటించింది. అయితే ఎన్నో అంచనాల మధ్య నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ విషయంలో ఆడియన్స్ నిరాశకు గురయ్యారని టాక్ నడిచింది. మొత్తానికి ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకుని.. క్లాసికల్ హిట్‏గా నిలిచింది.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజు రూ. 5 కోట్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాకు అనుకోని కారణాలు అడ్డుపడ్డాయి. నిన్న హైదరాబాద్ నగరంలో విశ్వ నాయకుడు అంబేడ్కర్ అతిపెద్ద విగ్రహాన్ని ఓపెనింగ్ చేయడంతో అటు వైపుగా ఉన్న థియేటర్లలో షోస్ రద్దు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 32.60% ఆక్యుపెన్సీని పొందింది.  అయితే రానున్న రోజుల్లో ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

గతంలో వచ్చిన యశోద చిత్రం మొదటి రోజు రూ. 3 కోట్లు వసూళు చేసింది. వారాంతంలోనే రూ. 10 కోట్లకు పైగా రాబట్టింది. శాకుంతలం చిత్రంలో ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, గౌతమి, మధుబాల కీలకపాత్రలలో నటించగా.. మణిశర్మ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.