
బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆక్టటుకున్న సీరియల్ గుప్పెడంత మనసు. కార్తీక దీపం తర్వాత ఆ స్థాయిలో టీఆర్పీ సొంతం చేసుకున్న ధారవాహిక ఇదే. ఈ సీరియల్ కి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉండేది. ఈ సీరియల్ లో రిషి, వసుధార పాత్రలు ప్రేక్షకులకు దగ్గరయ్యాయి. సాయంత్రమైందంటే చాలు ప్రతి ఇంట్లో ఇదే సీరియల్ నడిచేది 2020లో ప్రారంభమైన ఈ సీరియల్ అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించి టాప్ స్థానంలో దూసుకుపోయింది. మహేంద్ర, జగతి మేడమ్, దేవయాని పాత్రలకు కూడా అభిమానులు ఉన్నారంటే ఈ సీరియల్ కు వచ్చిన రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉందో చెప్పక్కర్లేదు.
రిషి పాత్రలో కన్నడ నటుడు ముఖేష్ గౌడ నటించగా.. వసుధార పాత్రలో రక్షా గౌడ నటించింది. వీరిద్దరి జోడికి యూత్ ఫాలోయింగ్ ఎక్కువే. అయితే ఇందులో అందం, అమాయకత్వం తెలివైన అమ్మాయిగా ఇలా అన్ని రకాలుగా తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది వసూధార. ఇటీవలే ఈ సీరియల్ కు శుభం కార్డ్ పడిన సంగతి తెలిసిందే. వసుధార పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రక్షా గౌడ.. ఆ సీరియల్లో పంజాబీ డ్రెస్సులు, చీరకట్టులో ఎంతో పద్దతిగా కనిపించింది.
కానీ సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా డిఫరెంట్. మోడ్రన్ డ్రెస్సులలో గ్లామర్ షో నెట్టింట ఫాలోవర్లను కట్టిపడేస్తుంది. తాజాగా వసుధార క్రేజీ ఫోటోస్ ఇన్ స్టాలో వైరలవుతున్నాయి. ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తుంది. ఈ హాట్ బ్యూటీ ఫోటోలకు కుర్రాళ్ళు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా హీరోయిన్ అవ్వాల్సిన బ్యూటీ సీరియల్ హీరోయిన్ అయ్యింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అలాగే కొంతమంది ఈ చిన్నదాని ఫోటోలపై కవితలు కూడా రాస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.