AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shanmukh Jaswanth: షణ్ముఖ్ కేసులో ఊహించని ట్విస్ట్ లు.. సంచలన విషయాలు బయటపెట్టిన బాధితురాలు

బిగ్‌బాస్‌ ఫేమ్‌, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. షణ్ముఖ్ సోదరుడు సంపత్‌పై మౌనిక అనే యువతి కంప్లైంట్‌ చేయడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే, పోలీసుల విచారణలో కథ ఊహించని మలుపుతిరిగింది. చీటింగ్‌ కేసులో విచారణకు వెళ్తే... డ్రగ్స్‌తో అడ్డంగా దొరికిపోయారు షణ్ముఖ్ బ్రదర్స్‌. షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు మౌనిక.

Shanmukh Jaswanth: షణ్ముఖ్ కేసులో ఊహించని ట్విస్ట్ లు.. సంచలన విషయాలు బయటపెట్టిన బాధితురాలు
Shanmukh Jaswanth In Ganja Case
Rajeev Rayala
|

Updated on: Feb 22, 2024 | 2:21 PM

Share

మరోసారి వార్తల్లో నిలిచాడు బిగ్ బాస్ ఫేం, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్.  పోలీసుల అదుపులో బిగ్‌బాస్ ఫేం షణ్ముక్‌ సోదరులు ఉన్నారు. గంజాయితో పట్టుబడ్డారు షణ్ముక్‌, సంపత్‌ వినయ్‌. ఆరు రోజుల్లో పెళ్లి ఉండగా మరో యువతిని పెళ్లిచేసుకున్నాడు సంపత్ వినయ్‌. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు మౌనిక. సంపత్ ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వినయ్ ఫ్లాట్ ను తనిఖీ చేశారు.  సంపత్‌ వినయ్‌ ఫ్లాట్‌లో గంజాయి లభ్యం అయింది. సంపత్ గంజాయి వాడుతున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. షణ్ముక్‌ పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో షణ్ముఖ్ పై అతని సోదరుడి పై బాధితురాలు మౌనిక సంచలన   ఆరోపణలు చేసింది.

ఫిర్యాదులో కీలక విషయాలు బయట పెట్టింది బాధితురాలు మౌనిక. షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ నమ్మించి మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని నాపై అనేకసార్లు లైంగిక దాడి చేశాడని తెలిపింది. అంతే కాదు ఒకసారి అబార్షన్‌ కూడా చేయించాడు అని తెలిపింది బాధితురాలు మౌనిక. ఎవరికైనా చెబితే పర్సనల్ ఫొటోలు వైరల్ చేస్తానని బెదిరించాడు.  షణ్ముఖ్‌ తల్లిదండ్రులకు చెబితే… వాళ్లు కూడా ఫొటోలు బయటపెడతామని బెదిరించారు. మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశా అని తెలిపింది మౌనిక

అంతే కాదు ఫిర్యాదులో షణ్ముఖ్‌పైనా సంచలన ఆరోపణలు చేసింది మౌనిక.  షణ్ముఖ్‌ దగ్గర గంజాయి, డ్రగ్‌ పిల్స్‌ దొరికాయ్‌. డ్రగ్స్‌ను పోలీసులు కూడా చూశారు… నా దగ్గర వీడియో ఉంది!.  కానిస్టేబుల్‌ జావేద్‌ షణ్ముఖ్‌కి సహకరించే ప్రయత్నం చేశాడు.  కాంప్రమైజ్‌ కావాలని కానిస్టేబుల్‌ జావేద్‌ ఒత్తిడి చేశాడు అని తెలిపింది మౌనిక.

బిగ్‌బాస్‌ ఫేమ్‌, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. షణ్ముఖ్ సోదరుడు సంపత్‌పై మౌనిక అనే యువతి కంప్లైంట్‌ చేయడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే, పోలీసుల విచారణలో కథ ఊహించని మలుపుతిరిగింది. చీటింగ్‌ కేసులో విచారణకు వెళ్తే… డ్రగ్స్‌తో అడ్డంగా దొరికిపోయారు షణ్ముఖ్ బ్రదర్స్‌. షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు మౌనిక. ప్రేమ, పెళ్లి పేరుతో తనను నమ్మించి… మోసం చేశాడని కంప్లైంట్‌ చేసింది. యువతి ఫిర్యాదుతో విచారణ కోసం నానక్‌రాంగూడలోని షణ్ముఖ్‌ ఇంటికి వెళ్లిన పోలీసులకు… గంజాయితో దొరికిపోయారు ఇద్దరు.

షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు..ఇద్దరికి ఎంగేజ్‌మెంట్‌ కూడా అయ్యింది..ఆ తర్వాత ఆమెను దూరం పెట్టేశాడు. ఆరు రోజుల్లోపెళ్లి ఉండగా మరో యువతిని పెళ్లిచేసుకున్నాడు సంపత్ వినయ్‌..ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు.. పోలీసులను ఆశ్రయించింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంపత్‌ని అదుపులోకి తీసుకునేందుకు షణ్ముఖ్‌ నివాసానికి వెళ్లారు. పోలీసులతో పాటు యువతి కూడా అక్కడికి వెళ్లింది. ఇంట్లోకి వెళ్లి చూడగా..షణ్ముఖ్‌ ఒక్కడే కనిపించాడు. అతని వద్ద గంజాయి లభించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.