బడా హీరోలకు లవర్‌గా.. రవితేజకు అక్కగా నటించిన ఏకైక స్టార్ హీరోయిన్.. ఇప్పటికీ అదే క్రేజ్ అదే అందం..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన వాళ్లలో మాస్ మహారాజా రవితేజ ఒకడు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో చిన్నా చితకా పాత్రలు పోషించిన అతను ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాతో హీరోగా సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఇడియట్, అమ్మానాన్నో తమిళ అమ్మాయి, ఖడ్గం, వెంకీ, భద్ర, విక్రమార్కుడు, కిక్ , శంభో శివ శంభో, బలుపు, పవర్, రాజా ది గ్రేట్ , క్రాక్ , వాల్తేర్ వీరయ్య లాంటి ఎన్నోబ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాడు.

సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు మాస్ మహారాజ రవితేజ. స్వయంకృషితో ఎదిగి తనకంటూ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు రవితేజ. వరుసగా సినిమాలు చేస్తున్నా.. కూడా సాలిడ్ హిట్ అందుకోవడానికి కష్టపడుతున్నాడు. ఒక్క సినిమా హిట్ పడితే.. నాలుగు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. చివరిగా వచ్చిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పుడు ఇరుముడి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు రవితేజ. మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాతో రవితేజ భారీ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే రవితేజకు అక్కగా నటించిన స్టార్ హీరోయిన్ గురించి తెలుసా.?
ఆమె మాములు హీరోయిన్ కాదు. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఆమె ఇప్పుడు.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి బడా హీరోలతో ఆమె నటించి మెప్పించింది. ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. రవితేజ కెరీర్ బిగినింగ్ లో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.అంతే కాదు రవితేజ విలన్ గాను చేశారు. కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున నటించిన నిన్నేపెళ్లాడుతా సినిమాలో చిన్న నెగిటివ్ రోల్ లో కనిపించాడు. అలాగే జగపతిబాబు హీరోగా నటించిన బడ్జెట్ పద్మనాభం సినిమాలో సహాయక పాత్రల్లో నటించాడు. ఈ సినిమాలో రమ్యకృష్ణ తమ్ముడిగా కనిపించాడు రవితేజ. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
రవితేజ ఆతర్వాత సింధూరం సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు ఈ సినిమాలో రవితేజ తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వరుసగా సినిమా ఆఫర్స్ అందుకున్నాడు రవితేజ.. సిందూరం, ఖడ్గం, ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ్ అమ్మయి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, భద్ర, నా ఆటోగ్రాఫ్, విక్రమార్కుడు, వెంకీ, దుబాయ్ శ్రీను, మిరపకాయ్, కిక్ , ధమకా, వాల్తేరు వీరయ్య ఇలా ఎన్నో హిట్స్ అందుకున్నాడు రవితేజ.. ఇక ఇప్పుడు ఇరుముడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకానుంది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




