Prabhas: ప్రభాస్ ‘ఫౌజీ’ మూవీ అప్డేట్.. సెట్‍లోకి అడుగుపెట్టిన సీనియర్ హీరోయిన్..

|

Sep 25, 2024 | 7:52 AM

సీతారామం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ తన కొత్త సినిమాను చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్టుకు ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట. ఇదివరకే రిలీజ్ అయిన పోస్టర్ చూస్తుంటే.. ఈ సినిమా యుద్ధం, ఆర్మీ నేపథ్యంలో ఉండనున్నట్లు తెలుస్తోంది.

Prabhas: ప్రభాస్ ఫౌజీ మూవీ అప్డేట్.. సెట్‍లోకి అడుగుపెట్టిన సీనియర్ హీరోయిన్..
Prabhas Hanu Raghavapudi Movie
Follow us on

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని నెలలుగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే సలార్, కల్కి 2898 ఏడీ చిత్రాలతో భారీ విజయాలను అందుకున్న డార్లింగ్.. ఇప్పుడు రాజాసాబ్ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో వింటేజ్ ప్రభాస్ కనిపించనున్నాడనే టాక్ నడుస్తుంది. ఇదివరకు విడుదలైన టీజర్ సైతం సినిమాపై మరింత క్యూరియాసిటీని కలిగించింది. ఈ చిత్రాన్ని హారర్ కామెడీ డ్రామాగా తీసుకువస్తున్నారు. ఈ సినిమాతోపాటు ఇటీవలే మరో కొత్త ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. సీతారామం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ తన కొత్త సినిమాను చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే ప్రాజెక్టుకు ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట. ఇదివరకే రిలీజ్ అయిన పోస్టర్ చూస్తుంటే.. ఈ సినిమా యుద్ధం, ఆర్మీ నేపథ్యంలో ఉండనున్నట్లు తెలుస్తోంది.

ఫౌజీ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారు. యుద్ధం నేపథ్యంలో ఓ డీసెంట్ లవ్ స్టోరీని ఈ చిత్రం ద్వారా చూపించనున్నాడట హను రాఘవపూడి. ఇందులో కొత్త అమ్మాయి ఇమాన్వి కథానాయికగా నటిస్తుంది. ఈ బ్యూటీకి ఇది ఫస్ట్ మూవీ కావడం విశేషం. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణ మధురైలో స్టా్ర్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదివరకే కొందరు యూనిట్ సభ్యులతో కలిసి అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడట డైరెక్టర్ హను. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు ఫౌజీ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యిందని సమాచారం.

ఇవి కూడా చదవండి

ఫౌజీ మూవీలో సీనియర్ హీరోయిన్ జయప్రద కీలకపాత్రలో నటిస్తుందట. ఇటీవలే హీరోయిన్ ఇమాన్వీతో కలిసి జయప్రద షూటింగ్ లో జాయిన్ అయ్యిందని.. ప్రస్తుతం వారిద్దరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అయితే ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటీ అనేది తెలియరాలేదు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ కథానాయికగా ఓ వెలుగు వెలిగిన జయప్రద… ఆ తర్వాత సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది. ఇక కొన్నాళ్లుగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చాలా కాలం తర్వాత ఇప్పుడు ప్రభాస్ సినిమా ద్వారా మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.