Tollywood : తెలుగులో చక్రం తిప్పిన హీరోయిన్.. 12 సంవత్సరాల తర్వాత సినిమాల్లోకి.. ఎవరంటే..

ఒకప్పుడు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తక్కువ సమయంలోనే అగ్ర హీరోలకు జోడిగా నటించి స్టార్ డమ్ సంపాదించుకున్న ఆ హీరోయిన్.. ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాలకు తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇంతకీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆమె ఎవరో తెలుసా.. ?

Tollywood : తెలుగులో చక్రం తిప్పిన హీరోయిన్.. 12 సంవత్సరాల తర్వాత సినిమాల్లోకి.. ఎవరంటే..
Roja

Updated on: Nov 06, 2025 | 4:27 PM

90వ దశకంలో తెలుగు సినీరంగంలో చక్రం తిప్పిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అద్భుతమైన నటనతో జనాలను కట్టిపడేసిన కొందరు తారలు ఇప్పటికీ సినిమాల్లో కొనసాగుతున్నారు. మరికొందరు మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఓ హీరోయిన్ తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. దాదాపు 12 సంవత్సరాలకు తిరిగి సినీరంగంలో సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ రోజా. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన రోజా.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోహీరోయిన్లకు తల్లిగా, అత్తగా కనిపించింది. ఇక కొన్నాళ్లుగా రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆమె సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇప్పుడు రోజా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.

ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..

డీడీ బాలచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న లెనిన్ పాండ్యన్ సినిమాలో రోజా కీలకపాత్రలో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత రీఎంట్రీ.. సంతోషంగా ఉంది డియర్ అంటూ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ తన సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో రోజా నటించిన సినిమాలు, పాటల క్లిప్పింగ్స్ జత చేశారు. చివరగా రోజా డీగ్లామర్ పాత్రలో పెద్దావిడగా కనిపించారు.ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు సంతానం అని రివీల్ చేశారు. ఈ చిత్రంలో మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా తమ్ముడు గంగై అమరన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :  Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

అలాగే ఈ సినిమాతోనే శివాజీ గణేశన్ మనవడు దర్శన్ గణేశన్ నటుడిగా పరిచయం కాబోతున్నారు. సత్యజోతి ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాతో దాదాపు 12 ఏళ్లకు రోజా రీఎంట్రీ ఇస్తున్నారు. ప్రేమ తపస్సు సినిమాతో సినీరంగంలోకి నటిగా అడుగుపెట్టిన రోజా.. దక్షిణాదిలోని అన్ని భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె.. రాజకీయాల్లోకి వచ్చాకా సినిమాలకు గుడ్ బై చెప్పారు. చాలా కాలం తర్వాత వెండితెరపై సందడి చేయబోతున్నారు రోజా.

Roja News

ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..