AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gauthami: ఏం అమ్మాయి రా బాబు.. అందంలో తల్లిని మించిపోయింది.. గౌతమి కూతురిని చూశారా ?..

భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న సమయంలోనే ప్రముఖ వ్యాపారవేత్త సందీప్ భాటియాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు జన్మించగా.. ఆమెకు సుబ్బలక్ష్మి అని నామకరణం చేశారు. కానీ ప్రేమ, పెళ్లి గౌతమి జీవితంలో ఎక్కువ కాలం నిలవలేదు. 1998లో పెళ్లి కాగా.. 1999లోనే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తన కూతురినిగ ఒంటరిగానే చూసుకుంది. పెళ్లి తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది గౌతమి. ఇక ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

Gauthami: ఏం అమ్మాయి రా బాబు.. అందంలో తల్లిని మించిపోయింది.. గౌతమి కూతురిని చూశారా ?..
Gauthami
Rajitha Chanti
|

Updated on: Mar 30, 2024 | 11:29 AM

Share

ఒకప్పుడు దక్షిణాది సినీ ప్రియుల అభిమాన హీరోయిన్ గౌతమి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అందం, అభినయంతో ప్రజల మనసులను గెలుచుకుంది. 90వ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. తెలుగులో ఆమె నటించిన బామ్మమాట బంగారు మూట, చైతన్య, అన్నా, పల్లెటూరి, శ్రీవెంకటేశ్వర కళ్యాణం, చిలక్కొట్టుడు, ద్రోహి వంటి చిత్రాలు పేరు తీసుకొచ్చాయి. అలాగే తనదైన నటనకు తమిళనాడు ప్రభుత్వం చేతుల మీదుగా పలు పురస్కారాలు అందుకుంది. భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న సమయంలోనే ప్రముఖ వ్యాపారవేత్త సందీప్ భాటియాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు జన్మించగా.. ఆమెకు సుబ్బలక్ష్మి అని నామకరణం చేశారు. కానీ ప్రేమ, పెళ్లి గౌతమి జీవితంలో ఎక్కువ కాలం నిలవలేదు. 1998లో పెళ్లి కాగా.. 1999లోనే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తన కూతురినిగ ఒంటరిగానే చూసుకుంది. పెళ్లి తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది గౌతమి. ఇక ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

మళ్లీ సౌత్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో సహాయ పాత్రలు పోషిస్తుంది. ఇక గౌతమి కూతురు సుబ్బలక్ష్మి ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఉన్నత చదువులు పూర్తి చేసిన సుబ్బలక్ష్మి నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటుంది. గ్లామరస్, ఫ్యాషనబుల్ ఫోటోస్ అభిమానులతో పంచుకుంటుంది. సుబ్బలక్ష్మి చూడ్డానికి అచ్చం తన తల్లిలాగే మరింత అందంగా ఉంటుంది. అలాగే గ్లామర్ షోకు దూరంగా ఉంటూ తల్లిలాగే ట్రెడిషనల్ లుక్స్‏తోనే కట్టిపడేస్తుంది సుబ్బలక్ష్మి. ఆమె చూడ్డానికి బాలీవుడ్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ఉందిని కామెంట్స్ చేస్తుంటారు నెటిజన్స్. అయితే కేవలం సోషల్ మీడియా వరకే యాక్టివ్ గా ఉన్న సుబ్బలక్ష్మికి నటనపై అంతగా ఆసక్తి లేనట్లుగా తెలుస్తోంది. కానీ ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందని గతంలో వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు.

ప్రస్తుతం గౌతమి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రేమ, పెళ్లి, విడాకుల తర్వాత చాలాకాలం పాటు ఒంటరిగానే ఉంది గౌతమి. ఆ తర్వాత 2004 నుంచి 2016 వరకు కమల్ హాసన్ తో సహజీవనం చేశారు. కానీ ఆ తర్వాత వీరి బంధం అనుహ్యంగా ముగిసింది. ప్రస్తుతం గౌతమి తన కూతురితో కలిసి ఒంటరిగానే ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.