Tillu Square First Day Collections: అట్లుంటది టిల్లుగాడితో.. కొడితే బాక్సాఫీస్ షేక్.. ‘టిల్లు స్క్వేర్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఏంతంటే..
గతంలో సూపర్ హిట్ అయిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్వ్కేర్ మూవీలో సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. మార్చి 29న విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ అందుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఈమూవీకి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయింది.

ఎట్టకేలకు టిల్లు స్క్వేర్ మూవీ అడియన్స్ ముందుకు వచ్చేసింది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసిన అభిమానులకు అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించాడు టిల్లు అలియాస్ సిద్ధూ జొన్నలగడ్డ. టీజర్, ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్‌తో సినిమాపై ఆసక్తిని కలిగించిన మేకర్స్.. ఇక ఇప్పుడు థియేటర్లలో నాన్ స్టాప్ కామెడీతో అలరిస్తున్నారు. గతంలో సూపర్ హిట్ అయిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్వ్కేర్ మూవీలో సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. మార్చి 29న విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ అందుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ఈమూవీకి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయింది.
డీజే టిల్లు సీక్వెల్ కావడంతో ముందు నుంచే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో థియేట్రికల్ రైట్స్ భారీగా అమ్ముడయ్యాయి. ఈ చిత్రానికి ఏకంగా రూ. 27 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లుగా సమాచారం. ఇక మొదటిరోజు సైతం కలెక్షన్ భారీగానే వ్చిచనట్లు తెలుస్తుంది. తాజాగా కలెక్షన్స్ విషయాలను చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. టిల్లు స్క్వేర్ చిత్రానికి ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ. 23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఇక అమెరికాలో ఈ సినిమా మొదటి రోజు 1 మిలియన్ డాలర్స్ పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ వీకెండ్ శనివారం, ఆదివారం కావడంతో ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. మూడు నాలుగు రోజుల్లోనే దాదాపు రూ. 50 కోట్లు దాటేస్తుందని.. సులభంగా బ్రేక్ ఈవెన్ అయిపోతుందని భావిస్తున్నారు. ఈ సినిమా రూ. 100 కోట్లు వసూలు చేసే ఛాన్స్ ఉందన్నారు ప్రొడ్యూసర్ నాగవంశీ. మొత్తానికి టిల్లు ఫస్ట్ డే బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసాడు.
Tillu Registers a 𝐃𝐎𝐔𝐁𝐋𝐄 𝐁𝐋𝐎𝐂𝐊𝐁𝐔𝐒𝐓𝐄𝐑 Start at the Box-Office with 𝟐𝟑.𝟕 𝐆𝐑𝐎𝐒𝐒 on 𝐃𝐀𝐘 𝟏 🔥
Our Starboy 🌟 is shattering the records all over! 💥💥
Book your tickets here – https://t.co/vEd8ktSAEW #Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala… pic.twitter.com/Dz7hqglg5Z
— Sithara Entertainments (@SitharaEnts) March 30, 2024
Earth shattering is a small word…
Tillanna Mass bating everywhere in home and overseas
Overseas gross of 1.2 Million and counting… Overseas release by @Radhakrishnaen9 #Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @kalyanshankar23 @NavinNooli @vamsi84 @SitharaEnts pic.twitter.com/5ytyi2DIwZ
— Radhakrishnaentertainments (@Radhakrishnaen9) March 30, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



