AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: గడ్డకట్టే చలిలో టాలీవుడ్ స్టార్ వెకేషన్.. మంచులో సెల్ఫీ తీసుకున్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టగలరా ?..

ప్రస్తుతం ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారా ? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. బాలనటుడిగా తెరంగేట్రం చేసి అనేక చిత్రాల్లో తనదైన నటనతో అలరించాడు. ఆ తర్వాత హీరోగానూ మెప్పించారు. ఇంతకీ ఆ స్టార్ ఎవరో తెలుసా ?.. అతడు మరెవరో కాదు..

Tollywood: గడ్డకట్టే చలిలో టాలీవుడ్ స్టార్ వెకేషన్.. మంచులో సెల్ఫీ తీసుకున్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టగలరా ?..
Actor
Rajitha Chanti
|

Updated on: Mar 30, 2024 | 10:23 AM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోను గుర్తుపట్టండి.. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న హీరో. ప్రస్తుతం ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారా ? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. బాలనటుడిగా తెరంగేట్రం చేసి అనేక చిత్రాల్లో తనదైన నటనతో అలరించాడు. ఆ తర్వాత హీరోగానూ మెప్పించారు. ఇంతకీ ఆ స్టార్ ఎవరో తెలుసా ?.. అతడు మరెవరో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్తున్న మహేష్.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ వైరలయ్యాయి. ప్రస్తుతం మహేష్.. ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్‏లో ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్కడ గడ్డ కట్టే చలిలో.. మంచు కొండల్లో కూతురు సితార, కుమారుడు గౌతమ్ తో కలిసి సెల్ఫీలకు ఫోజులిచ్చాడు. ఇప్పుడు మహేష్ షేర్ చేసిన ఫోటోస్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ప్రారంభంలోనే గుంటూరు కారం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు మహేష్. డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్లో ఉందనే సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ కాగా.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో వచ్చే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నట్లు గతంలోనే వెల్లడించారు మేకర్స్. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో మహేష్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. కానీ ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ పై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.

ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించనున్నారని సమాచారం. అలాగే ఇందులో మహేష్ దాదాపు ఎనిమిది సరికొత్త గెటప్స్‏లో కనిపించనున్నారని.. ఇఫ్పటికే మేకోవర్ లుక్స్ టెస్ట్ జరిగిందని అంటున్నారు. హాలీవుడ్ హీరో రేంజ్‏లో మహేష్ కనిపించనున్నాడని టాక్. ఈ వేసవిలోనే ఎస్ఎస్ఎంబీ 29 ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us