AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Daniel Balaji: ‘చిరుత’ విలన్ జీవితం విషాదాంతం.. డేనియల్ బాలాజీకి తీరని కోరిక.. ఎవరికి తెలియని నిజాలు..

బాలాజీ అకాల మరణం పట్ల సినీ ప్రపంచంలో సంతాపం తెలుపుతుంది. తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు డేనియల్ బాలాజీ. బుల్లితెరపై హీరోగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన బాలాజీ.. సినిమాల్లో మాత్రం ఎక్కువగా విలన్ పాత్రలు పోషించారు. ఘర్షణ, చిరుత, టక్ జగదీష్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. బాలాజీ అంత్యక్రియలు ఈరోజు తన నివాసంలో జరగనున్నాయి.

Daniel Balaji: 'చిరుత' విలన్ జీవితం విషాదాంతం.. డేనియల్ బాలాజీకి తీరని కోరిక.. ఎవరికి తెలియని నిజాలు..
Daniel Balaji Life
Rajitha Chanti
|

Updated on: Mar 30, 2024 | 10:04 AM

Share

కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ (48) గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం అర్దరాత్రి ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలరించారు. అప్పటికే బాలాజీ మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. బాలాజీ అకాల మరణం పట్ల సినీ ప్రపంచంలో సంతాపం తెలుపుతుంది. తెలుగు, తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు డేనియల్ బాలాజీ. బుల్లితెరపై హీరోగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన బాలాజీ.. సినిమాల్లో మాత్రం ఎక్కువగా విలన్ పాత్రలు పోషించారు. ఘర్షణ, చిరుత, టక్ జగదీష్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. బాలాజీ అంత్యక్రియలు ఈరోజు తన నివాసంలో జరగనున్నాయి.

డేనియల్ బాలాజీ 1975లో జన్మించారు. చిన్నప్పటి నుంచి సినీ పరిశ్రమపై ఆసక్తి ఉండడంతో తారామణి ఫిల్క్ కాలేజీలో చేరి శిక్షణ తీసుకున్నాడు. ఎప్పటికైనా మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని డేనియల్ బాలాజీ కల.. కానీ ఆ కోరిక తీరకుండానే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. తారామణి కాలేజీలో శిక్షణ పూర్తైన వెంటనే అతడికి కమల్ హాసన్ నటించిన మరుదనాయకం సినిమాలో అవకాశం వచ్చింది. డైరెక్టర్ కావాలనే కోరికతో ఈ సినిమాకు చాలాకాలంపాటు ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేశాడు. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే అతడికి రాధిక శరత్ కుమార్ నటించిన చిత్తి.. (పిన్ని) సీరియల్లో అవకాశం వచ్చింది. అలా వెండితెర కంటే ముందు బుల్లితెరపై అరంగేట్రం చేశాడు. ఈ సీరియల్లో డేనియల్ పాత్రలో కనిపించాడు. అప్పటి నుంచి అతడిని డేనియల్ బాలాజీ అని పిలుస్తారు అభిమానులు.

ఆ తర్వాత అలలు సీరియల్లో నటించాడు బాలాజీ. ఈ సీరియల్ తర్వాతే అతడికి సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో విలన్ గా కనిపించాడు. సాంబ, ఘర్షణ, చిరుత, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాల్లో కనిపించాడు. చివరగా న్యాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ సినిమాలో నటించాడు డేనియల్ బాలాజీ. అటు తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న డేనియల్ బాలాజీ.. శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించాడు. ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ యాక్టర్ అయినప్పటికీ డైరెక్టర్ కావాలనేది అతడి చిరకాల కల. ఆ కారణంగానే డేనియల్ బాలాజీ తారామణి ఫిల్మ్ కాలేజీలో చేరాడు. ఇక దర్శకుడిగా సినిమాకు దర్శకత్వం వహించాలని ప్రయత్నించిన డేనియల్ బాలాజీకి సరైన అవకాశాలు రాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా