AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajendra Prasad: స్టేజ్ పై రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు.. అలీని అంత మాట అనేశాడేంటీ.. ?

టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల కాలంలో సినిమాలతోపాటు వివాదాలతోనూ ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు. కొన్నిరోజులుగా ఆయన మాట్లాడే మాటలు కాంట్రవర్సీ అవుతున్నాయి. సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా రాజేంద్రప్రసాద్ మరోసారి నోరు జారారు. తన పక్కనే ఉన్న నటులపై అనుచిత వ్యా్ఖ్యలు చేశారు.

Rajitha Chanti
|

Updated on: Jun 02, 2025 | 2:06 PM

Share

తెలుగు సినీపరిశ్రమలో దశాబ్దాలుగా అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్. కానీ ఈమధ్యకాలంలో సినిమాలతోపాటు వివాదాస్పద వ్యాఖ్యలతోనూ నిత్యం వార్తలలో నిలుస్తున్నారు. సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలలో ఆయన చేసే కామెంట్స్ కాంట్రవర్సీ అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా తన పక్కన ఉన్న నటులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈసారి అదుపుతప్పి తన సహ నటుడు, కమెడియన్ అలీపై నోరు జారారు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. సీనియర్ డైరెక్టర్ ఎస్‍వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఆ వేడుకకు తనికెళ్ల భరణి, రాజేంద్రప్రసాద్, మురళీమోహన్, శ్రీకాంత్, రోజా, ఆమని, ఇంద్రజ, లయ, రవళి, బ్రహ్మానందం, అలీ, ఉత్తేజ్, శివాజీ రాజా తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. అలీ ఎక్కడ అంటూ ఓ అసభ్య పదాన్ని వాడారు. ఇప్పుడు అదే మాట ఆయనపై విమర్శలు రావడానికి కారణమయ్యింది. అలాగే తనకు ఎన్టీఆర్ అవార్డు వచ్చిందని చెబుతున్న సమయంలో ఎవరూ చప్పట్లు కొట్టకపోవడంతో.. బుద్దుందా.. లేదా? అవార్డు అంటే చప్పట్లు కొట్టరా అంటూ మండిపడ్డారు. అక్కడే స్టేజ్ పై ఉన్న అచ్చిరెడ్డిని ఉద్దేశిస్తూ…బయటకు రా నీ సంగతి తేలుస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతుండడంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..