Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సక్సెస్‌కు ప్రధాన కారణం అదే.. షార్ట్ స్పాన్‌లో స్టార్ హీరోగా
చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగారు విజయ్ దేవరకొండ. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా.. సోషల్ మీడియాలోనూ సంచలనాలు రేపుతున్నారు.
Tollywood: ఒకే ఇమేజ్‌కు అలవాటు పడిపోతే.. అందులోనే ఇరుక్కుపోతే.. ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండటం కష్టమే. అలా సింగిల్ ఇమేజ్‌తో మరుగున పడిన హీరోలెందరో ఉన్నారు. అందులో తాను ఉండనంటున్నారు విజయ్ దేవరకొండ. సినిమా సినిమాకు కావాల్సినంత వేరియేషన్ చూపిస్తున్నారు రౌడీ బాయ్. ఓసారి లవ్ స్టోరీ చేస్తే.. వెంటనే మాస్ సినిమా చేస్తున్నారు.. ఆ వెంటనే దేశభక్తి అంటున్నారు. ఎంచుకుంటున్న కథలే విజయ్ కెరీర్‌కు శ్రీ రామరక్షలా మారిపోయింది. పెళ్లి చూపులు(pelli choopulu) లాంటి సాఫ్ట్ సినిమా తర్వాత అర్జున్ రెడ్డి(Arjun Reddy) టైప్ ఆఫ్ సినిమా చేయాలంటే ఏ నటుడికైనా ఎంతో కష్టం.. కానీ విజయ్ దేవరకొండకు మాత్రం చాలా ఈజీ. అలాగే అర్జున్ రెడ్డి తర్వాత గీత గోవిందంలో మేడమ్ అంటూ తన ఇమేజ్ తగ్గించుకుని.. హీరోయిన్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చారు రౌడీ హీరో. ఆ వెంటనే టాక్సీ వాలా, నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్(World Famous Lover).. ఇలా ప్రతీ సినిమాకు వేరియేషన్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు విజయ్.
చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగారు విజయ్ దేవరకొండ. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా.. సోషల్ మీడియాలోనూ సంచలనాలు రేపుతున్నారు ఈయన. తాజాగా విజయ్ మూడు సినిమాలు చేస్తున్నారు. ఈ మూడూ వేటికవే పూర్తిగా భిన్నం. లైగర్ బాక్సింగ్ నేపథ్యంలో వస్తుంది. పూరీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆగస్ట్ 25న విడుదల కానుంది లైగర్. తాజాగా లైగర్‌లోని అక్‌డీ పక్‌డీ ప్రోమో సాంగ్ విడుదలైంది. లైగర్ లాంటి యాక్షన్ సినిమా తర్వాత ఖుషీ అంటూ పూర్తిగా ఫ్యామిలీ సబ్జెక్ట్‌కు షిఫ్ట్ అయ్యారు విజయ్. సమంత ఇందులో హీరోయిన్. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఖుషీ డిసెంబర్ 23న విడుదల కానుంది. వీటితో పాటు జనగణమన లాంటి పేట్రియాట్రిక్ కథతో రానున్నారు విజయ్. పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. 2023, ఆగస్ట్ 3న జనగణమన విడుదల కానుంది. ఇండియన్ మిలటరీ సిస్టమ్‌నే లక్ష్యంగా ఈ సినిమా చేస్తున్నారు పూరీ. మొత్తానికి ఈ మూడు సినిమాలతో విజయ్ దేరవకొండ మార్కెట్ ఎంతవరకు పెరుగుతుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..