
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తోన్న సినిమా భోళా శంకర్. డైరెక్టర్ మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో చిరు జోడిగా మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. కీలకపాత్రలో సుశాంత్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈమూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఇందులో చిరు, మిల్కీబ్యూటీ జోడి ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అన్నా, చెల్లి మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత దర్శకత్వం వహిస్తోన్న మెహర్ రమేశ్ ఈ సినిమా ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక చాలా కాలం తర్వాత చిరు ఇందులో టాక్సీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నారు.
భారీ స్థాయిలో హైప్ నెలకొన్న ఈ సినిమాను ఆగస్ట్ 11న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తు్న్నారు మేకర్స్. మాస్ యాక్షన్ కథాంశంతో రాబోతున్న ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత చిరు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ, డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో నటించనున్నారు.
A delightful melody that weaves a beautiful tapestry of emotions this rainy season❤️#MilkyBeauty Lyrical song out now❤️🔥
– https://t.co/qXFH0C7ghG#BholaaShankar 🔱@SagarMahati thumping musical 🥁
A film by @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial… pic.twitter.com/qw0fkamyVd
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 21, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.