Karthi: విజయవాడ క‌న‌క‌దుర్గమ్మను దర్శించుకున్న హీరో కార్తీ.. వీడియో చూడండి

|

Sep 30, 2024 | 7:20 PM

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన తాజా చిత్రం సత్యం సుందరం. రోజా ఫేమ్ అరవింద్ స్వామి మరో కీలక పాత్రలో మెరిశాడు. 96 సినిమాతో ఫీల్ గుడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రేమ్ కుమార్ ఈ సినిమాను ఎంతో హృద్యంగా తెరకెక్కించాడు. సెప్టెంబ‌ర్ 28న థియేటర్లలో రిలీజైన సత్యం సుందరం సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది.

Karthi: విజయవాడ క‌న‌క‌దుర్గమ్మను దర్శించుకున్న హీరో కార్తీ.. వీడియో చూడండి
Karthi
Follow us on

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన తాజా చిత్రం సత్యం సుందరం. రోజా ఫేమ్ అరవింద్ స్వామి మరో కీలక పాత్రలో మెరిశాడు. 96 సినిమాతో ఫీల్ గుడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రేమ్ కుమార్ ఈ సినిమాను ఎంతో హృద్యంగా తెరకెక్కించాడు. సెప్టెంబ‌ర్ 28న థియేటర్లలో రిలీజైన సత్యం సుందరం సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా చూసిన వారందరూ చాలా రోజుల‌కు ఒక మంచి సినిమా చూశామంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున సైతం సత్యం సుందరం సినిమాను చూసి కార్తీని అభినందించాడు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు కార్తీ. ఈ నేపథ్యంలో అతను తాజాగా విజయవాడ కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నాడు. సోమవారం (సెప్టెంబర్ 30) దర్శకుడు ప్రేమ్ కుమార్ తో కలిసి ఆలయానికి వచ్చిన కార్తీకి ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాడు కార్తీ. ఈ సందర్భంగా వారికి అర్చకులు ఆశీర్వాదం అందించారు. ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ ‘విజయవాడ కనకదుర్గమ్మ అంటే మా కుటుంబానికి ఎంతో ఇష్టం. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ అమ్మవారి దర్శనానికి వచ్చాను. మా సత్యం సుందరం సినిమా చూసి నాగార్జన అభినందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ మా సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు.

కార్తీ ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. సత్యం సుందరం సినిమాను 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య, జ్యోతిక దీనిని నిర్మించారు. శ్రీ దివ్య, రాజ్ కిరణ్, దేవ దర్శినీ, శ్రీరంజనీ, ఇళవరసు, కరుణాకరన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి గోవింద్‌ వసంత సంగీతమందించారు.

ఇవి కూడా చదవండి

కనక దుర్గమ్మ ఆలయంలో హీరో కార్తీ.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.