Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SatyaDev: యంగ్ హీరో సినిమాలో కీలక పాత్రలో కట్టప్ప.. సత్యదేవ్‌ సినిమాలో సత్యరాజ్

మెగాస్టార్ తో కలిసి ‘గాడ్ ఫాదర్’లో నటించి శభాష్ అనిపించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి ‘రామ్ సేతు’లో..

SatyaDev: యంగ్ హీరో సినిమాలో కీలక పాత్రలో కట్టప్ప.. సత్యదేవ్‌ సినిమాలో సత్యరాజ్
Satyaraj
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 27, 2022 | 8:42 AM

వెర్సటైల్ హీరో సత్యదేవ్‌ సినిమాల్లో ఓ ప్రత్యేకత ఉంటుంది. ఓ వైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు సైడ్ క్యారెక్టర్ గా దూసుకుపోతున్నాడు సత్యదేవ్. పాత్ర ఏదైనా అందులో ఇమిడిపోతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇటీవల మెగాస్టార్ తో కలిసి ‘గాడ్ ఫాదర్’లో నటించి శభాష్ అనిపించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి ‘రామ్ సేతు’లో సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సత్య దేవ్ , కన్నడ స్టార్ డాలీ ధనంజయ కలిసి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సత్యదేవ్, డాలీ ధనంజయ ఇద్దరికీ ఇది 26వ ప్రాజెక్ట్.

నిర్మాతలు బాల సుందరం, దినేష్ సుందరం ఓల్డ్ టౌన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా క్రిమినల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. వెటరన్ యాక్టర్ సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారు. కథలో ఆయన పాత్ర చాలా ఇంపాక్ట్ ఫుల్ గా వుండబోతుంది. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు నటించబోతున్నారు,. ఒక హీరోయిన్ గా ప్రియా భవానీ శంకర్ ఇటీవల నిర్మాతలు ప్రకటించారు.

చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మణికంఠన్ కృష్ణమాచారి సినిమాటోగ్రాఫర్. మీరాఖ్ డైలాగ్స్ రాస్తుండగా, అనిల్ క్రిష్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సత్యదేవ్‌, ధనంజయ వైవిధ్యమైన పాత్రలతో అలరించి తమకంటూ ఒక మార్క్ ని సంపాదించుకున్నారు. వీరిద్దరూ కలసి చేస్తున్న ఈ సినిమాపై సహజంగానే ప్రేక్షకుల్లో క్యూరీయాసిటీ నెలకొంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర ప్రముఖ నటీనటులను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు .

ఇవి కూడా చదవండి
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..