AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR 30: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న తారక్ నయా లుక్.. కొరటాల సినిమా కోసమేనా.?

ఇక ఇప్పుడు తారక్ నెక్ట్స్ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

NTR 30: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న తారక్ నయా లుక్.. కొరటాల సినిమా కోసమేనా.?
Ntr
Rajeev Rayala
|

Updated on: Oct 27, 2022 | 9:08 AM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఆయన నటించిన ఆర్ఆర్ ఆర్సినిమా సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తారక్ నెక్ట్స్ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వరుస విజయాలతో దూసుకుపోతోన్న కొరటాల ఇటీవల ఆచార్య సినిమాతో మొదటి ఫ్లాప్‌ను అందుకున్నాడు. ఆచార్య సినిమా నిరాశపరచడంతో తారక్ సినిమా పై మరింత ఫోకస్ పెట్టాడు కొరటాల.ఈ క్రమంలోనే ఓ హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేశారని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే మొన్నామధ్య ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ను హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారని టాక్ వినిపించింది .

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో తారక్ లుక్ గురించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తారక్ చాలా ఛేజ్ అయ్యాడు. కాస్త బరువు కూడా పెరిగాడు. అయితే ఇప్పుడు కొరటాల సినిమా కోసం సన్నగా మారిపోయాడు. తారక్ లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ వెళ్ళాడు తారక్ అక్కడ క్లిక్ మనిపించిన ఫోటోలలో తారక్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు.

తారక్ స్టైల్ మొత్తం కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అని ఫాన్స్ అయితే చాలా ఆనంద పడుతున్నారు. అయితే ఎన్టీఆర్ ఈ షేప్ లోకి రావడానికి ప్రధాన కారణం కొరటాల శివ అని తెలుస్తోంది. ఎన్టీఆర్ 30వ సినిమాలో హీరో క్యారెక్టర్ కు తగ్గట్టుగా తారక్ ఇలా స్లిమ్ గా మారారట. ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్