తమిళ్ యంగ్ హీరో ధృవ సర్జా ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం కెడీ ది డెవిల్. ఈ సినిమాకు డైరెక్టర్ ప్రేమ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ టీజర్ గురువారం విడుదల చేసింది చిత్రయూనిట్. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్‌కు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ వాయిస్ అందించారు. కెడీ ది డెవిల్ టీజర్ లాంచ్ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిని సంజయ్ దత్ మాట్లాడుతూ.. తనకు సౌత్ సినిమాలంటే ఫ్యాషన్ అని.. ఇక్కడి చిత్రాల్లో నటించడం చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. అలాగే కేజీఎఫ్ 2 హీరో యశ్ పై ప్రశంసలు కురిపించారు. కేజీఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సినిమా తమిళ్ తోపాటు హిందీ, తెలుగు, కన్నడలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
సంజయ్ దత్ మాట్లాడుతూ.. ” ఎస్‌ఎస్ రాజమౌళి మంచి మిత్రుడు. సౌత్‌లో చేసే సినిమాల్లో నటించాలని ఉంది. ఇక్కడ సినిమా పట్ల అభిమానుల ప్రేమ, ఉత్సాహం కనిపిస్తాయి. అంతేకాకుండా హీరోయిజాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ముంబైలో మనం మన మూలాలను మరచిపోకూడదు. నేను కేజీఎఫ్ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది. యష్, ప్రశాంత్ హోంబాలే నిర్మాణంలో కేజీఎఫ్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు, నేను ధృవతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను” అని ఆయన చెప్పారు.
స్టైలిష్ యాక్షన్ డ్రామాగా వస్తున్న కెడీ ది విలన్ చిత్రానికి అర్జున్ జన్య సంగీతం అందిస్తున్నారు. ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తమిళ్ తోపాటు.. హిందీ, కన్నడ, తెలుగు, మలయాళి భాషలలో విడుదల చేయనున్నారు.