Sanjay Dutt: ఆ టాలీవుడ్ స్టార్ హీరో మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్.. ఏ సినిమాలో అంటే..
ప్రస్తుతం ప్రేక్షకులు ఎదురుచూస్తున్న భారీ సినిమాల్లో కేజీఎఫ్ 2 సినిమా కూడా ఒకటి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.
Sanjay Dutt: ప్రస్తుతం ప్రేక్షకులు ఎదురుచూస్తున్న భారీ సినిమాల్లో కేజీఎఫ్ 2 సినిమా కూడా ఒకటి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. కేజేఎఫ్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఇప్పుడు కేజీఎఫ్ 2 ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటించనున్నాడు. సంజయ్ ఈ సినిమాలో అధీరా పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సంజయ్ దత్ పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగు సినిమాలో సంజయ్ నటించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో కూడా ఈ విలక్షణ నటుడు విలన్ పాత్రలో కనిపించనున్నాడట.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటించనున్నాడని తెలుస్తుంది. గతంలో కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన చంద్రలేఖ అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు సంజయ్ దత్. ఇప్పుడు ఇన్నిసంవత్సరాలతర్వాత మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నాడు సంజయ్. ఇక ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. గతంలో వచ్చిన అతడు, ఖలేజా మాదిరి కాకుండా ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుందని టాక్. మరి ఈ సినిమాలో సంజయ్ దత్ నటిస్తున్నాడన్న దానిలో ఎంత వాస్తవం ఉంది అన్నది తెలిసియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చదవండి :