ఇసుక వల్ల ‘సాహో’కు బ్రేక్..

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సాహో మూవీ వాయిదా పడటంతో ఫ్యాన్స్ అందరూ తెగ డిస్సపాయింట్ అయ్యారు. కానీ.. ఆ గ్యాప్ ఎక్కువ లేకపోవడంతో సరిపోయింది. అయితే.. సాహో వాయిదా పడటానికి కారణం విజువల్ ఎఫెక్ట్ అన్న విషయం తెలిసిందే. కానీ.. కొత్తగా సాహో వాయిదా పడటానికి ఇసుక.. కూడా కారణమంటూ వార్తలు వస్తున్నాయి. ఇసుకకు.. సాహో రిలీజ్‌కి.. లింక్ ఏంటి..? అని అనుకుంటున్నారా..? ఈ మూవీలో హెల్ బాయ్‌ లాంటి రాక్షసులకు పోలిన ఫారిన్ ఫైటర్స్‌తో ప్రభాస్ […]

ఇసుక వల్ల 'సాహో'కు బ్రేక్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Jul 25, 2019 | 7:01 PM

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సాహో మూవీ వాయిదా పడటంతో ఫ్యాన్స్ అందరూ తెగ డిస్సపాయింట్ అయ్యారు. కానీ.. ఆ గ్యాప్ ఎక్కువ లేకపోవడంతో సరిపోయింది. అయితే.. సాహో వాయిదా పడటానికి కారణం విజువల్ ఎఫెక్ట్ అన్న విషయం తెలిసిందే. కానీ.. కొత్తగా సాహో వాయిదా పడటానికి ఇసుక.. కూడా కారణమంటూ వార్తలు వస్తున్నాయి. ఇసుకకు.. సాహో రిలీజ్‌కి.. లింక్ ఏంటి..? అని అనుకుంటున్నారా..? ఈ మూవీలో హెల్ బాయ్‌ లాంటి రాక్షసులకు పోలిన ఫారిన్ ఫైటర్స్‌తో ప్రభాస్ ఫైట్ చేసే భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. అందులో ఇసుక తుఫాన్ వస్తుంది. దీన్నే.. టీజర్ చివర్లో కూడా చూడొచ్చు.

కాగా.. దీనికి సంబంధించిన విఎఫ్ ఎక్స్ వర్క్ జరిగిన తర్వాత ఫైనల్ కట్ చూస్తే చలా తేడాగా అనిపించిందట. దీంతో.. పార్ట్ మొత్తాన్ని మళ్లీ రీ ఎడిట్ చేసి ఎఫెక్సట్ మార్చామని చెప్పారట. దానికి వారం రోజుల అవసరం అని చెప్పడంతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ ఒక్క సీన్ సినిమాలో చాలా కీలకం కావడంతో.. ఏ మాత్రం తేడా కొట్టినా సినిమాకే దెబ్బ అని భావించిన టీం.. టైం తీసుకున్నా పర్లేదు కానీ.. అవుట్‌పుట్ మాత్రం బాగారావాలని సాహోని వాయిదా వేసినట్టుగా లేటెస్ట్‌గా వార్తలు వినిపిస్తున్నాయి.