‘ఇస్మార్ట్ శంకర్’.. ఎన్నో రియల్ ట్విస్టులు!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా గతవారం విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో చిత్రం నడుస్తోంది. ఇది ఇలా ఉండగా ఇస్మార్ట్ శంకర్ కథ నాదేనని.. పూరి కాపీ చేశాడని హీరో ఆకాష్ మీడియా ముందుకు వచ్చి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా పూరి జగన్నాధ్ స్పందించాడు. ‘ఆకాష్ కి నాకు […]

  • Ravi Kiran
  • Publish Date - 7:15 pm, Thu, 25 July 19
'ఇస్మార్ట్ శంకర్'.. ఎన్నో రియల్ ట్విస్టులు!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా గతవారం విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతోంది. ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో చిత్రం నడుస్తోంది. ఇది ఇలా ఉండగా ఇస్మార్ట్ శంకర్ కథ నాదేనని.. పూరి కాపీ చేశాడని హీరో ఆకాష్ మీడియా ముందుకు వచ్చి ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా పూరి జగన్నాధ్ స్పందించాడు.

‘ఆకాష్ కి నాకు ఏ సంబంధం లేదు.. నేనెప్పుడూ కలవలేదు.. ఏవో అలిగేషన్స్ వస్తాయి కదా.. ఇవన్నీ కామన్..’ అంటూ తనదైన శైలిలో పూరి జవాబు ఇచ్చాడు. అటు హీరో ఆకాష్ మాత్రం.. తాను పూరిని సంప్రదించడానికి ట్రై చేశానని.. వాళ్ళు మాత్రం సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదని చెప్పాడు. ఇక ఆ తర్వాత ఆకాష్ పూరికి ఫోన్ చేశానని .. పూరి మేనేజర్‌ని కలిసి తన వద్ద ఉన్న ఆధారాల్ని చూపించానని అన్నాడు. ఈ విషయంపై నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్‌తో కూడా సంప్రదింపులు జరిపానని.. లీగల్‌గా చర్యలు తీసుకోనున్నట్లు ఆకాష్ తెలిపాడు.

ఇది ఇలా ఉండగా తాను తెరకెక్కించిన 2016 హిట్ చిత్రం `నాన్ యార్` కథని కాపీ చేసి పూరి `ఇస్మార్ట్ శంకర్` చిత్రాన్ని తీశారని హీరో ఆకాశ్ వాదన. దాదాపు 15 పైగా సీన్లు కాపీ చేశారని ఆయన ఆరోపించారు. ‘నాన్ యార్’ సినిమా తెలుగులో ‘కొత్తగా ఉన్నాడు’ పేరిట డబ్ అయింది. దాని ట్రైలర్ చూస్తే.. దాదాపు ‘ఇస్మార్ట్ శంకర్’ పాయింట్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఆకాష్ సినిమాను షార్ట్ ఫిలిం మాదిరి తెరకెక్కించాడు. ఇది ఒక ఎత్తైతే.. వీరిద్దరూ తీసిన సినిమాలకు మెయిన్ థీమ్.. హాలీవుడ్‌లో తెరకెక్కించిన ‘క్రిమినల్’ సినిమా నుంచి తీసుకుంది. ఏది ఏమైనా మున్ముందు ఈ వివాదం ఏ స్థాయికి చేరుకుంటుందో వేచి చూడాలి.

కాగా ‘ఇస్మార్ట్ శంకర్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. రామ్ కెరీర్‌లో తొలి 25 కోట్లు సాధించిన సినిమాగా ఇది నిలిచింది. బీ, సీ సెంటర్ల జనాలకు మాత్రమే ఇచ్చి నచ్చగా.. వీక్ డేస్‌లో ఈ సినిమా రన్ నెమ్మదించింది. మొత్తానికి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏబో యావరేజ్ సినిమాగా నిలిచింది.