DD Next level: ‘గోవింద నామాల్ని ఇలా వాడుతారా..?’ సంతానం సినిమాలోని పాటపై బీజేపీ కన్నెర్ర
సినిమా పేరు "DD నెక్స్ట్ లెవెల్". ఈ మూవీలో వీళ్ల పైత్యం అంతకు నెక్స్ట్ లెవెల్..!. ఔను.. ఈ సినిమా ప్రమోషన్ కోసం రిలీజ్ చేసిన లిరికల్ వీడియోకి ఏకంగా గోవింద నామాల్ని వాడేశారు. కోలీవుడ్‌లో చెలరేగిన వివాదంతో హిందూ సంఘాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.. దానికి సంబంధించిన డీటేల్స్ తెలుసుకుందాం పదండి..

డీడీ నెక్ట్స్ లెవెల్ సినిమాలో శ్రీనివాస గోవింద పాటను పేరడీ చేశారని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తిరుమల శ్రీవారిని అవమానించారంటూ బీజేపీ మండిపడుతోంది. సినిమాలో పాటను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ వివాదపై పలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి.
వివాదంపై నేపథ్యంలో మూవీ టీమ్ స్పందించింది. తిరుమల శ్రీవారిని అవమానించలేదని ప్రకటించింది. తాము తీస్తున్న సినిమాపై సెన్సార్ బోర్డు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని చెబుతోంది. నిబంధనల ప్రకారమే సినిమా తీశాం, ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరంలేదన్నాడు నటుడు సంతానం. తాజాగా సినిమా పాటపై అభ్యంతం వ్యక్తం చేస్తూ తమిళనాడు సేలంలో కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ నాయకులు.
ఈ మూవీలో సంతానం రివ్యూయర్‌గా నటించారు. దాన్ని ప్రమోట్ చేయడం కోసం రిలీజ్ చేసిన లిరికల్ వీడియోలో గోవింద.. గోవింద థీమ్ తీసుకున్నారు. తిరుమల శ్రీవారి నామాలకు సంబంధించిన “గోవింద” పదాలను, ట్యూన్‌ను.. ఇక్కడ నెగిటివ్ సెన్స్‌లో వాడారనేది హిందూ సంఘాల అభ్యంతరం. సినిమాకి టికెట్ కొంటే పార్కింగ్ ఫీజ్ వేస్టు.. పాప్‌కార్న్ ట్యాక్స్ వేస్టు.. అంటూ ప్రతిదానికీ గోవింద అనే పదం యాడ్ చేసి ఈ వీడియో రిలీజ్ చేశారు. ఈ సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
భక్తితోనే ఆ పదాలను పాటలో పెట్టామని అంటున్నారు హీరో. సినిమాకు సంబంధించినంత వరకు సెన్సార్ ప్రధానం. దారినపోయే వాళ్లు చెబితే పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు హీరో సంతానం. ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీని తెలుగులోనూ విడుదల చేయబోతుంది యూనిట్. ఈ పరిణామాల నేపథ్యంలో చిత్ర రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.