Samyuktha Menon: నాకు నటించడం రాదు అని అన్నారు.. సంయుక్త మీనన్ షాకింగ్ కామెంట్స్
భీమ్లానాయక్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఆ సినిమాలో రానా భార్యగా నటించి మెప్పించింది. అలాగే బింబిసారా సినిమాతో హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది.అలాగే ధనుష్ నటించిన సార్ సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది. ఇక లేటెస్ట్ గా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాలో నటించింది
సంయుక్త మీనన్.. ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్ లో కాస్త గట్టిగానే వినిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఆ సినిమాలో రానా భార్యగా నటించి మెప్పించింది. అలాగే బింబిసారా సినిమాతో హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది.అలాగే ధనుష్ నటించిన సార్ సినిమాతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది. ఇక లేటెస్ట్ గా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాలో నటించింది. ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఈ మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో సంయుక్త ఖాతాలో మరో హిట్ పడింది. సాయి ధరమ్ తేజ్ కు ఈ సినిమా సాలిడ్ కంబ్యాక్ అనే చెప్పాలి. విరూపాక్ష సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది సంయుక్త మీనన్. ఈ సినిమాతో అమ్మడి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.
తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘ఒకప్పుడు ఉద్యోగంలో స్థిరపడటమే నా ఏకైక లక్ష్యం. అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చా అని తెలిపింది సంయుక్త. అలాగే ఈ అమ్మడు ముందుగా మలయాళం లో సినిమాలు చేసిన విషయం తెలిసిందే..
అయితే తన తొలి సినిమా చూసి అందరు తనకు నటించడం రాదు అని కామెంట్స్ చేశారని చెప్పుకొచ్చింది. 2016లో నా తొలి మలయాళ చిత్రం ‘పాప్‌కార్న్’ చూసి అందరూ నాకు నటించడం రాదన్నారు. వాస్తవానికి అప్పటికి నాకు సినిమాల గురించి అంతగా తెలియదు. కథ, స్క్రిప్ట్‌పై అవగాహన లేదు. కానీ ఇప్పుడు నాకు ఇండస్ట్రీ పై అవగాహనా వచ్చింది. అందుకే సినిమాలు జాగ్రత్తగా ఎంచుకుంటున్నా.. నన్ను నేను నిరూపించుకుంటున్నాను అని అన్నారు సంయుక్త.