
టాలీవుడ్ లవబుల్ కపుల్స్లలో సమంత (Samantha) నాగచైతన్య (Nagachaitanya) జంట ఒకటి. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరి ఆకస్మాత్తుగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇరువురు తమ సోషల్ మీడియా ఖాతాలలో ప్రకటించడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. ప్రేమ.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లితో ఒక్కటైన ఈ జంట విడాకులు తీసుకోవడానికి గల కారణాలను మాత్రం బయటపెట్టలేదు. అయితే విడాకుల ప్రకటన అనంతరం చైతూ సోషల్ మీడియాలో సైలెంట్ కాగా.. సామ్ మాత్రం మోటివేషనల్ కోట్స్. ఫోటోషూట్స్.. మూవీ అప్డే్ట్స్ అంటూ యాక్టివ్గా ఉంటోంది. ఇక సమంత షేర్ చేసే మోటివేషనల్ కోట్స్ క్షణాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇంతకీ సామ్ ఆ పోస్ట్స్ ద్వారా ఏం చెప్పాలనుకుంటుంది అనే సందేహాలను వ్యక్తం చేశారు ఫ్యాన్స్.. అంతేకాకుండా.. విడాకుల ప్రకటనకు ముందే సామ్ అక్కినేని పేరు మార్చడం.. ఆ తర్వాత తన సోషల్ మీడియా ఖాతాలలో నాగచైతన్య ఫోటోస్ డెలీట్ చేసింది. తాజాగా మరో షాకిచ్చింది సామ్..
ఇన్స్టాలో ఆమె.. నాగచైతన్యను ఆన్ ఫాలో చేసింది. అక్కినేని కుటుంబంలోని నాగార్జున, రానా, వెంకటేష్ కుమార్తె ఆశ్రితలను ఇంకా ఫాలో అవుతూనే ఉంది. అయితే సమంత అన్ ఫాలో చేసినప్పటికీ చైతూ మాత్రం సామ్ ను ఇంకా ఫాలో అవుతూనే ఉన్నాడు. అలాగే.. సమంతతో కలిసి ఉన్న ఫోటోలను కూడా చేయలేదు. ఏమాయ చేసావే సినిమాతో వీరిద్దరి ప్రేమ మొదలై 2017 అక్టోబర్ 6న వీరిద్దరూ హిందూ, క్రిస్టియన్ పద్దతులలో పెళ్లి చేసుకున్నారు.. ప్రస్తుతం సామ్ టాలీవుడ్ టూ బాలీవుడ్.. హాలీవుడ్లో చేతినిండా సినిమాలు.. యాడ్స్ అంటూ తెగ బిజీ అయిపోయింది.
Also Read: Aamir Khan: ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై ఆమీర్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మన చరిత్రకు నిదర్శనమంటూ..
Krithi Shetty: బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న బేబమ్మ.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో..
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ కారు ఆపి తనిఖీ చేసిన పోలీసులు.. పూర్తి వివరాలు..