AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: నా పాత రోజులన్నీ గుర్తుకు వచ్చాయి.. సమంత ఆసక్తికర కామెంట్స్..

ప్రముఖ నటి సమంత నిర్మాతగా ట్రా లాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న చిత్రం ‘శుభం’. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ మూవీకి వివేక్ సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు సమంత మీడియాతో ముచ్చటించారు.

Samantha: నా పాత రోజులన్నీ గుర్తుకు వచ్చాయి.. సమంత ఆసక్తికర కామెంట్స్..
Samantha
Rajeev Rayala
|

Updated on: May 07, 2025 | 7:25 AM

Share

ఇన్నాళ్లు కథానాయికగా అలరించిన సమంత ఇప్పుడు నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే తిరిగి సినీరంగంలో యాక్టివ్ అవుతున్న సామ్.. అటు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అలాగే ఇటు ప్రొడక్షన్ రంగంలోకి అడుగుపెట్టింది. కొన్నాళ్ల క్రితమే ట్రాలాలా పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది సామ్. ఇదిలా ఉంటే.. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై టాలీవుడ్ హీరోయిన్ సమంత నిర్మాతగా నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని మే 9న విడుదల చేయబోతోన్నారు. తాజాగా ఈ సినిమా గురించి సమంత మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

సమంత మాట్లాడుతూ.. గౌతమ్ మీనన్ గారు నాకు మొదటి ఛాన్స్ ఇచ్చారు. ఆయన తల్చుకుంటే ఆ టైంలో ఏ టాప్ హీరోయిన్‌ అయినా నటించేవారు. కానీ ఆయన నాలాంటి కొత్త వారికి అవకాశం ఇచ్చారు. నేను కూడా నిర్మాతగా కొత్త వారిని ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతోనే ఉన్నాను.  ఎన్నో కలలు కంటూ సినిమా పరిశ్రమలోకి వస్తారు. మా చిత్రం కోసం శ్రియా, శ్రావణి, షాలినీలు ఎంతో కష్టపడ్డారు. నా సినిమాలో నటించిన వారందరినీ చూస్తే నా పాత రోజులన్నీ గుర్తుకు వచ్చాయి. నటిగా ఉన్నప్పుడు నిర్మాత కష్టాలేవీ నాకు అర్థం కాలేదు. ఒక్క రోజు ఒక్క సీన్ అనుకున్నట్టుగా జరగకపోతే ఎంత నష్టం వస్తుంది.. డబ్బు ఎంత వృథా అవుతుందో నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. ఎంతో మంది టైం వేస్ట్ అవుతుందని అర్థమైంది.

‘శుభం’ చిత్రంలోని కేమియో పాత్రని నేను చేయాల్సింది కాదు. కానీ నిర్మాతగా మొదటి సారిగా నేను ఎవరి దగ్గరకు వెళ్లి ఫేవర్ అడగాలని అనుకోలేదు. అందుకే ఆ పాత్రను నేనే పోషించాను. నేను ఈ మూవీని ఇంకో మూడు, నాలుగు రోజులు మాత్రమే ప్రమోట్ చేయగలను. కానీ ఆ తరువాత ఈ మూవీ భారమంతా ప్రేక్షకుల మీదే ఉంటుంది.  ‘శుభం’ చిత్రానికి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టాం. సినిమా చూస్తే అందరికీ ఆ విషయం అర్థం అవుతుంది. తక్కువ పెట్టలేదు.. అలా అని ఎక్కువ ఖర్చు పెట్టలేదు. ప్రతీ సినిమాకు, కథకు ఎంత కావాలో అంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు