Samantha: నాకు మొండితనం ఎక్కువ.. అనుకున్న పని కచ్చితంగా చేయాల్సిందే.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

|

Nov 09, 2022 | 8:49 AM

రియల్ లైఫ్‌లో కూడా సమంత ఫైటర్. మయోసైటిస్‌తో పోరాటం చేస్తూ, చికిత్స (సెలైన్) తీసుకుంటూ 'యశోద' డబ్బింగ్ పూర్తి చేశారు.

Samantha: నాకు మొండితనం ఎక్కువ.. అనుకున్న పని కచ్చితంగా చేయాల్సిందే.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Samantha
Follow us on

‘యశోద’లో సమంత భావోద్వేగభరిత పాత్ర చేశారు. తనకు ఎదురైన పరిస్థితుల నుంచి బయట పడటం కోసం పోరాటం చేసే మహిళగా కనిపించనున్నారు. రియల్ లైఫ్‌లో కూడా సమంత ఫైటర్. మయోసైటిస్‌తో పోరాటం చేస్తూ, చికిత్స (సెలైన్) తీసుకుంటూ ‘యశోద’ డబ్బింగ్ పూర్తి చేశారు. హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సినిమాతో పాటు తన ఆరోగ్య పరిస్థితి గురించి సమంత మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

సమంత మాట్లాడుతూ.. ” సాధారణంగా నేను ఏదైనా స్క్రిప్ట్ ఓకే చేయడానికి ఒక రోజు సమయం తీసుకుంటా. కానీ, ‘యశోద’ వెంటనే ఓకే చేశా. నేను విన్న వెంటనే ఓకే చేసేసిన కథల్లో ‘యశోద’ ఒకటి. ‘యశోద’ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. పవర్ ఫుల్ స్టోరీ ఇది. అందుకని, ఎక్కువగా ఆలోచించడానికి ఏమీ లేదు. కథ విన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. థ్రిల్ అయ్యాను. ప్రేక్షకులు కూడా అదే విధంగా థ్రిల్ అవుతారని, వాళ్ళకూ గూస్ బంప్స్ వస్తాయని ఆశిస్తున్నాను. సినిమాలో అంత పవర్ ఉంది. దర్శకులు హరి, హరీష్ కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే.. ‘యశోద’కు డబ్బింగ్ చెప్పాలని ముందు నుంచి డిసైడ్ అయ్యాను. ఒక్కసారి నేను కమిట్ అయ్యానంటే… చేయాల్సిందే. ఓ క్యారెక్టర్ చేసేటప్పుడు ఆర్టిస్ట్ ప్రాణం పెట్టారంటే… వాళ్ళే డబ్బింగ్ చెప్పాలని కోరుకుంటారు. తమ వాయిస్ వినిపించాలని అనుకుంటారు. నేను ఇంతే… నాలో ఆ పట్టుదల ఉంది. నాకు మొండితనం ఎక్కువ. సవాళ్లు ఎదురైనప్పటికీ డబ్బింగ్ చెప్పగలిగినందుకు సంతోషంగా ఉంది ” అంటూ చెప్పుకొచ్చారు సమంత.

సరోగసి నేపథ్యంలో తెరకెక్కిన యశోద చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్..ఉన్ని కృష్ణన్ ముకుందన్ కీలకపాత్రలలో నటించారు. ఈ మూవీలో సామ్ గర్భవతిగా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.