Citadel Trailer: బాబోయ్..! కుమ్మేసిన సమంత.. సిటాడెల్ ట్రైలర్ వచ్చేసింది..

సమంత కేవలం తెలుగు, తమిళ్ లోనే కాదు హిందీలోనూ నటించి ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది సామ్. ఇక ఇప్పుడు సిటాడెల్  సిరీస్ తో మరోసారి హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది సమంత. తాజాగా సిటాడెల్  ట్రైలర్ ను విడుదల చేశారు.

Citadel Trailer:  బాబోయ్..! కుమ్మేసిన సమంత.. సిటాడెల్ ట్రైలర్ వచ్చేసింది..
Samantha Citadel
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 15, 2024 | 8:13 PM

స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఖుషి సినిమా తర్వాత సమంత సినిమాలకు ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటుంది. సమంత కేవలం తెలుగు, తమిళ్ లోనే కాదు హిందీలోనూ నటించి ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది సామ్. ఇక ఇప్పుడు సిటాడెల్  సిరీస్ తో మరోసారి హిందీ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది సమంత. తాజాగా సిటాడెల్  ట్రైలర్ ను విడుదల చేశారు. ఓటీటీ లవర్స్  చాలా కాలంగా ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ లో సమంత రూత్ ప్రభు , వరుణ్ ధావన్ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ పై చాలా హైప్ క్రియేట్ అయ్యింది . ఇప్పుడు ఆ హైప్ మరింత పెంచేలా ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఇది కూడా చదవండి : ఓ మై వసుధారా..! వారెవ్వా అనిపిస్తున్న గుప్పెడంత మనసు భామ

ఈ ట్రైలర్‌లో సమంత యాక్షన్‌ని చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. వరుణ్ ధావన్, సమంతా కాంబినేషన్‌ని చూడాలని అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌కు ‘ది ఫ్యామిలీ మ్యాన్’ ఫేమ్ రాజ్,డీకే దర్శకత్వం వహించారు. వరుణ్ ధావన్ ఈ వెబ్ సిరీస్ ద్వారా తొలిసారి డిజిటల్ వరల్డ్ లోకి అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌లో మెరిసిన సమంత ఇప్పుడు ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌తో సందడి చేయనుంది.

ఇది కూడా చదవండి : మహేష్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే

‘సిటాడెల్: హనీ బానీ’ వెబ్ సిరీస్ భారీ బడ్జెట్‌తో రూపొందించారు. నవంబర్ 7న ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగాఈ ట్రైలర్‌ను ముంబైలో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమంత, వరుణ్ ధావన్, రాజ్-డీకే తదితరులు పాల్గొన్నారు. ఈ వెబ్ సిరీస్‌లో, సమంత హనీ పాత్రను పోషించగా, వరుణ్ ధావన్ బానీ పాత్రను పోషించాడు. వీరిద్దరూ స్పై పాత్ర పోషించారు. కేకే మీనన్, సికందర్ ఖేర్, సాకిబ్ సలీమ్ తదితరులు కూడా ‘సిటాడెల్’ నటించారు. సమంత అనారోగ్యంతో ఉన్నప్పటికీ చాలా కష్టపడి చేసిన వెబ్ సిరీస్ ఇది. కాబట్టి ఆమె అభిమానులకు ఇది చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఈ సిరీస్‌ని హిందీతో పాటు పలు భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నారు.

ఇది కూడా చదవండి :ఒంటరిగానే చూడాల్సిన సినిమా.. బోల్డ్ సీన్స్ దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. కానీ ఓటీటీలోకి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!