
టాలీవుడ్ స్టార్ హీరో సమంత (Samantha)తన పుట్టిన రోజున శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తెలిపారు. ఏప్రిల్ 28న సామ్ 35వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు.. సన్నిహితులు.. అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు బర్త్ డే విషెష్ తెలియజేశారు. ముఖ్యంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేసిన సర్ప్రైజ్ విషెష్ పై సామ్ స్పందించింది. విజయ్ షేర్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసింది.. ” ఇది స్వీటెస్ట్ సర్ ప్రైజ్.. ఇది ఫ్రీజింగ్‌గా ఉంది.. ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నాం.. కానీ ఈ స్కామ్ స్టర్లు నన్ను ఆశ్చర్యాన్ని కలగకుండా ఆపలేదు.. ” అంటూ ట్వీట్ చేసింది. అలాగే తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సన్నిహితులు, అభిమానుల పట్ల భావోద్వేగ పోస్ట్ చేసింది..
“నా పుట్టిన రోజు సందర్భంగా నాకు ప్రేమతో శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ అందరి నుంచి నాకు లభించిన ప్రోత్సాహం, ప్రేరణ, సానుకూలతకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలినే.. నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను.. మీరు ఈ ఏడాదిలో నేను ఉత్సాహంగా ఉండేందుకు నాలో ప్రోత్సాహాన్ని నింపారు.” అంటూ సామ్ భావోద్వేగ ట్వీట్ చేసింది.
Thank you all so much for the outpouring of love and good wishes on my birthday! I am eternally grateful for the encouragement, motivation and positive vibes I get from you all! I love you with all my heart. You have made me so excited to dive into the year that lies ahead?
— Samantha (@Samanthaprabhu2) April 29, 2022
ప్రస్తుతం సామ్.. యశోద సినిమాలో నటిస్తోంది. అలాగే.. ఇప్పటికే ఆమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే.. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ. సమంత జంటగా అందమైన ప్రేమకథా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Acharya Movie Review: ఆచార్య అంచనాల సంచలనాలను అందుకున్నాడా.? మెగా మూవీ ఎలా ఉందంటే..
Acharya: మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాకోసం ట్రెండ్ అయిన ఐదుగురు భామలు వీరే
Tollywood : సౌత్ సినిమాలే శరణం అంటున్న బాలీవుడ్.. రీమేక్స్ వెంటపడుతున్న నార్త్ మేకర్స్
Siddhu Jonnalagadda : ఆ మలయాళ రీమేక్‌కు డీజే స్టార్ నో చెప్పారా..? కారణం ఇదేనా..?