Samantha : అన్నింటికీ మూలం నమ్మకమే.. ఒక్క పోస్టులో ఎన్నో విషయాలపై క్లారిటీ ఇచ్చిన సమంత..

|

Mar 12, 2023 | 9:27 AM

వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సామ్.. అటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పటికప్పుడు మోటివేషన్ కోట్స్ షేర్ చేస్తుంటుంది. ఆమె షేర్ చేసిన ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంటుంది. తాజాగా నమ్మకం గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది సామ్.

Samantha : అన్నింటికీ మూలం నమ్మకమే.. ఒక్క పోస్టులో ఎన్నో విషయాలపై క్లారిటీ ఇచ్చిన సమంత..
Samantha
Follow us on

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన సినిమాలపై దృష్టి పెట్టింది. కొన్ని నెలలుగా ఇంట్లోనే మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకన్న ఆమె.. ఇప్పుడు సిటాడెల్ సిరీస్ చిత్రీకరణలో పాల్గొంటుంది. ఇక ఇటీవలే ఖుషి మూవీ షూటింగ్ సెట్‏లో జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. అలాగే సమంత నటించిన శాకుంతలం సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సామ్.. అటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పటికప్పుడు మోటివేషన్ కోట్స్ షేర్ చేస్తుంటుంది. ఆమె షేర్ చేసిన ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంటుంది. తాజాగా నమ్మకం గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది సామ్.

“కొన్నిసార్లు అది మానవాతీత బలాన్ని ఏమాత్రం తీసుకోదు. కేవలం నమ్మకమే మిమ్మల్ని పొందుతుంది. విశ్వాసమే మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. నమ్మకమే మీ గురువు.. మీ స్నేహితుడిగా ఉంటుంది. మిమ్మల్ని నమ్మకమే మానవాతీతంగా చేస్తుంది. ” అంటూ లింగభైరవి అమ్మవారి ముందు సమంత ధ్యానం చేస్తున్న ఫోటోను షేర్ చేసింది సామ్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. సామ్ షేర్ చేసిన ఫోటోకు.. మీరు చాలా స్ట్రాంగ్.. ఆ అమ్మవారి ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

ఇవి కూడా చదవండి

సామ్ ఎక్కువగా ఇషా ఫౌండేషన్‏కు వెళ్తుందన్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. నిత్యం సద్గురు చెప్పిన సూచనలను.. తన ఇన్ స్టా వేదికగా షేర్ చేస్తుంటారు సామ్. ఇక అక్కడ ఉండే లింగ భైరవి దేవి అమ్మవారి విగ్రహాన్ని సమంత తన ఇంట్లోనే పూజిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల తమన్నా సైతం ఇషా ఫౌండేషన్‏లోని లింగ భైరవి అమ్మవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. కాషాయ దుస్తుల్లో లింగ భైరవి దేవిని దర్శించుకుని.. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఇందుకు సంబంధించిన వీడియోకు హీరోయిన్ సమంత రియాక్ట్ అవుతూ హార్ట్ ఎమోజీని చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.